ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు

చంద్రబాబు కుట్ర రాజకీయాలు ప్రజలు గమనించాలి

చంద్రబాబూ.. దిగజారుడు వ్యాఖ్యలు మానుకో..

కుట్రలు,కుతంత్రాలే చంద్రబాబుకు తెలిసిన రాజకీయం

 ఇదేనా  నలభై సంవత్సరాల అనుభవం..

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి నాగిరెడ్డి

విజయవాడ: తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా దిగజారుడు రాజకీయాలకు చంద్రబాబు,పవన్‌కల్యాణ్‌లు పాల్పడుతున్నారని  వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి ఎంవీ నాగిరెడ్డి ధ్వజమెత్తారు.ఆయన విజయవాడ వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైయస్‌ జగన్‌ ఓటేస్తే రౌడీ రాజ్యం వస్తుందని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించారు.నలభై సంవత్సరాలు రాజకీయాలో ఉన్న చంద్రబాబు నేర్చుకుంది ఇదేనా అని ప్రశ్నించారు. తెలంగాణలో ఆంధ్రులను కొడుతున్నారని,హైదరాబాద్‌ పాకిస్థానా అంటూ పవన్‌కల్యాణ్‌ కూడా ఇష్టమొచ్చిన రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తండ్రి మరణం తర్వాత బయటకు వచ్చి అప్పటికే ఎన్నికయిన కడప పార్లమెంటు సభ్యుడిగా రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్ళినప్పుడు..జగన్‌ బీజేపీతో కలిసిపోతున్నారని చెప్పి చంద్రబాబు విష ప్రచారం చేశారని గుర్తుచేశారు.

ఆ బీజేపీతోనే  చంద్రబాబు కలిసి పనిచేశారన్నారు. 2014 ఎన్నికల్లో  వైయస్‌ జగన్‌కు  ఓటేస్తే రాహుల్‌గాంధీకే ఓటేసినట్లేనని ప్రచారం చేశారన్నారు.అదే కాంగ్రెస్‌ పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడన్నారు. ఇప్పుడు వైయస్‌ జగన్‌కు ఓటేస్తే కేసీఆర్‌కే ఓటేసినట్లు అంటూ చంద్రబాబు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.టీఆర్‌ఎస్‌ పార్టీతో గతంలో పొత్తుపెట్టుకుని ఎన్నికలకు వెళ్ళిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.తెలంగాణ ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం చంద్రబాబు ప్రయత్నించలేదా అని ప్రశ్నించారు.ఈ విషయాన్ని చంద్రబాబే స్వయంగానే చెప్పుకోవడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.వాస్తవాలు ఇలా ఉంటే తెలంగాణలో ఆంధ్ర ప్రజలను కొడుతున్నారంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.

హైదరాబాద్‌లో ఆస్తుల  ఉన్న ఆంధ్ర నేతలను కేసీఆర్‌ బెదిరిస్తున్నారని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని, కేసీఆర్‌ నిజంగా బెదిరిస్తే.. చంద్రబాబుకు హైదరాబాద్‌లో ఆస్తులు లేవా అని ప్రశ్నించారు.వీటన్నింటిని వదిలిపెట్టి అన్నదమ్ములుగా ఉన్న రెండు తెలుగురాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్నారని ధ్వజమెత్తారు.వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అధికారంలోకి రాకుండా చేయడానికి కుట్రలు,కుయుక్తులు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రబాబు కుట్ర రాజకీయాలను తెలుగు ప్రజలు గమనించాలన్నారు. గతంలో బాబ్లీ ప్రాజెక్టు వద్ద ధర్నా చేయడానికి వెళ్ళిన చంద్రబాబు..కావాలని అక్కడ పోలీసులతో అరెస్ట్‌ చేయించుకుని చొక్కాలు చింపుకున్నాడని, ఆంధ్రకు వచ్చి కర్ణాటక పోలీసులు చొక్కాలు చింపారని,రోడ్డెక్కి ధర్నా చేయాలని పిలుపునిచ్చారని గుర్తుచేశారు.గతంలో ఢిల్లీలో వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి జలదీక్ష చేశారని, అప్పటికి  వైయస్‌ఆర్‌సీపీ కూడా ఏర్పాటు కాలేదన్నారు.ఆంధ్ర నుంచి నాలుగువేల అభిమానులు వెళ్ళి జలదీక్ష జరుపుతుంటే..అనుమతి సమయం ముగిసిందని సాయంత్రం పోలీసులు అరెస్ట్‌ చేయడానికి వస్తే వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడ్డుపడి..ఒక కార్యకర్తపై కూడా లాఠీ పడడానికి వీలులేదని, నన్ను అరెస్ట్‌ చేయండని చెప్పి అరెస్ట్‌యిన వ్యక్తి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు.

విలువలు కలిగిన వ్యక్తిత్వం ఉన్న నేత వైయస్‌ జగన్‌ అని అన్నారు.   వైయస్‌ జగన్‌పై కుట్రపూరిత కేసులు పెట్టి అరెస్ట్‌ చేసిన కూడా ఆయన శాంతియుతంగానే వ్యవహరించారని,ఎవరూ కూడా ఆవేశపడవద్దని, రాజ్యాంగ బద్ధంగా పోరాడద్దామని పిలుపునిచ్చారని గుర్తుచేశారు.నలభై సంవత్సరాలు అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు మాట్లాడే తీరు వీధి కార్యకర్తలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.చంద్రబాబు చెప్పేదానికి,చేసేదానికి ఎక్కడ పొంతన ఉండదన్నారు. న్యాయస్థానానికి దొరకకుండా చంద్రబాబు తప్పులు చేస్తున్నారని దుయ్యబట్టారు.  ప్రత్యేక విమానాలు,ప్రత్యేక హెలీకాప్టర్లతో పర్యటనలు చేస్తూ ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తున్నారన్నారు. గత తొమ్మిదేళ్ల చంద్రబాబు హయాంలో ఈ రాష్ట్రంలో ఎంతగా కరువు కాటకాలు ఉండేవో ప్రజలందరికి తెలుసు.వైయస్‌ఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. వైయస్‌ఆర్‌ ఆశయాలు కోసం వైయస్‌ జగన్‌ రాజకీయాల్లోకి వచ్చారన్నారు. స్వార్థ రాజకీయాల కోసం టీడీపీ,జనసేన పార్టీలు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాయన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపు,ఓటములు సహజమని,గెలుపు కోసం చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. హత్య,వెన్నుపోటు రాజకీయాలు, కుట్రలు,కుతంత్రాలే  చంద్రబాబుకు తెలిసిన రాజకీయాలని నిప్పులు చెరిగారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top