నా ప‌ద‌విపై త్వ‌ర‌లోనే పార్టీ ఆఫీస్ నుంచి ప్ర‌క‌ట‌న‌

సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌తో భేటీ అనంత‌రం ప్ర‌ముఖ న‌టుడు అలీ 

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ప్రముఖ నటుడు అలీ సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైయ‌స్‌ జగన్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. సీఎంతో భేటీ అనంత‌రం క్యాంపు ఆఫీస్‌లో మీడియా పాయింట్ వ‌ద్ద అలీ మాట్లాడారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ను మ‌ర్యాద‌పూర్వకంగా క‌లిశాన‌ని, త్వరలోనే గుడ్‌న్యూస్‌ ఉంటుందని ముఖ్య‌మంత్రి చెప్పారన్నారు. ఏమీ ఆశించకుండా పార్టీలోకి వచ్చాన‌ని తెలిపారు. త్వరలోనే త‌న‌ పదవిపై పార్టీ ఆఫీస్‌ నుంచి ప్రకటన వస్తుంద‌న్నారు. రెండు వారాల్లోనే ప్రకటన ఉంటుందని భావిస్తున్నానని అలీ చెప్పారు. సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నాన‌ని, సామాన్యులకు కూడా సినిమా టికెట్‌ అందుబాటులో ఉండాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని చెప్పారు. చిన్న సినిమాకు కూడా లాభం ఉండాలన్నదే ఉద్దేశం అని అలీ అన్నారు.

తాజా వీడియోలు

Back to Top