సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన క్రికెట‌ర్ కేఎస్ భ‌ర‌త్‌

కేఎస్‌ భరత్‌ను అభినందించిన ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని టీమిండియా క్రికెట్ ప్లేయ‌ర్ కే.ఎస్‌.భ‌ర‌త్ (కోన శ్రీ‌క‌ర్ భ‌ర‌త్‌) తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా కేఎస్ భ‌ర‌త్‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అభినందించారు. వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడిన భ‌ర‌త్‌.. టీం స‌భ్యుల ఆటోగ్రాఫ్‌తో కూడిన జెర్సీని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కు బ‌హూక‌రించారు. ఈ సమావేశంలో కేఎస్‌ భరత్‌తో పాటు ఆయన తల్లిదండ్రులు మంగాదేవి, శ్రీనివాసరావు, కోచ్‌ క్రిష్ణారావు, కుటుంబ సభ్యులు, ఎంపీ పి.వి.మిథున్‌ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎంతో జరిగిన సమావేశం గురించి కేఎస్‌ భరత్‌ ఏమన్నారంటే..
`జగన్‌ సార్‌ సీఎం అయిన తర్వాత ఇండియన్‌ క్రికెట్‌ టీంకు ఏపీ నుంచి మొదటగా ప్రాతినిధ్యం వహించడం, టెస్ట్ కెప్టెన్‌గా వ్యవహరించడం నాకు గర్వంగా ఉంది, ఈ విషయాలు సీఎంగారితో పంచుకున్నాను. ఆయన కూడా చాలా సంతోషంగా ఫీలయ్యారు, సార్‌ మీరు నాకు ఇన్స్‌పిరేషన్‌గా భావిస్తూ, ఒక క్రికెటర్‌గా మీ మద్దతు నాకు అవసరం అని చెప్పాను. సీఎంగారు కూడా దేశం గర్వపడేలా, మన రాష్ట్ర పేరు ప్రతిష్టలు నిలబెట్టాలని సూచించారు. ఏపీలో మౌలిక వసతులు బాగా పెరుగుతున్నాయి, అలాగే స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ కూడా బావుంది. క్రీడాకారులకు ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం ఒక క్రికెటర్‌గా చాలా బావుంది. మున్ముందు ఇలాంటి ప్రోత్సాహం వల్ల నాలాంటి క్రీడాకారులు మరింతగా వెలుగులోకి వస్తారు``. 

Back to Top