సీఎం వైయ‌స్ జగన్‌కు కృతజ్ఞతలు

 అమ‌రావ‌తి: పీఆర్సీని వర్తింపజేసి జీతాలు పెరిగేలా చేయడంతో మినిమమ్‌ టైం స్కేల్‌(ఎంటీఎస్‌) ఉపాధ్యాయులు సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలోని పలు జిల్లా కలెక్టరేట్ల ఎదుట బుధవారం ర్యాలీలు, సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేశారు. కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట ఆ జిల్లాలో పనిచేస్తోన్న ఎంటీఎస్‌ ఉద్యోగులందరూ సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

ఎంటీఎస్‌ ఉద్యోగుల సమన్వయ సంఘం నాయకుడు షేక్‌ పాషావలి మాట్లాడుతూ 6 నెలల క్రితం తమను ఎంటీఎస్‌ కింద ఉపాధ్యాయులుగా నియమించి రూ.21,230 జీతం కేటాయించారని,  తాము అడగకుండానే సీఎం వైయ‌స్‌ జగన్‌ 11వ పీఆర్సీని వర్తింపజేశారని, తద్వారా  జీతం రూ.11 వేలకుపైగా పెరిగి రూ.32,670కు చేరిందన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎంటీఎస్‌ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించి సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.  ఏపీ వెలుగు టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు  ఏలూరు కలెక్టరేట్‌ వద్ద సీఎం ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. విశాఖ కలెక్టరేట్‌ ఎదుట ఎంటీఎస్‌ ఉపాధ్యాయులు ప్రదర్శన నిర్వహించగా, గుంటూరు కలెక్టరేట్‌ వద్ద క్షీరాభిషేం చేశారు.   

తాజా వీడియోలు

Back to Top