సీఎంను కలిసిన ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి

తాడేపల్లి: ఇటీవ‌ల జ‌రిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన టి. కల్పలతారెడ్డి తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా కలిశారు. కృష్ణ, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన కల్పలతారెడ్డిని సీఎం వైయస్‌ జగన్‌ అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్‌ తదితరులు ఉన్నారు. 

Back to Top