గుడివాడలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ

కృష్ణా: గుడివాడలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. పరిషత్‌ ఎన్నికలను బహిష్కరిస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఒక్కొక్కరుగా టీడీపీని వీడుతున్నారు. తాజాగా నందివాడ మండల టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి దాసరి మేరీ విజయకుమారి.. మంత్రి కొడాలి నాని సమక్షంలో వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. ఆమెతో పాటుగా, పలువురు టీడీపీ నేతలు వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. ఈ మేరకు మంత్రి కొడాలి నాని వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 
 

Back to Top