విజయవాడ: టీడీపీ సోషల్ మీడియా వేధింపులపై వైయస్ఆర్‌సీపీ మహిళా కార్యకర్త పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలు సుచిత్ర సైబర్ క్రైంలో ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నందుకు తనను వేధింపులకు గురిచేస్తున్నారని.. టీడీపీ సోషల్ మీడియాలో తనపై అసభ్యంగా పోస్టులు పెడుతున్నారని సుచిత్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నా ఫోటోలు మార్ఫింగ్ చేసి అసభ్యంగా పోస్టులు పెడుతున్నారు. టీడీపీ సోషల్ మీడియా పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశా. మానసికంగా చాలా ఇబ్బంది పెడుతున్నారు. న్యూడ్ ఫోటోలు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారు. అత్యాచారం చేస్తామంటూ నన్ను బెదిరిస్తున్నారు’’ అని సుచిత్ర తెలిపారు