ఓట్ల తొలగింపులో టీడీపీ కొత్త కుట్ర

వైయస్‌ఆర్‌సీపీ నేతలపై తప్పుడు ప్రచారం

వైయస్‌ఆర్‌ జిల్లా: కడప ఓట్ల తొలగింపులో టీడీపీ  కొత్త నాటకానికి తెరతీసింది. వైయస్‌ఆర్‌సీపీ నేతలే ఓట్లు తొలగించారంటూ తప్పుడు ప్రచారం చేస్తోంది.కడపలో పలువురు వైయస్‌ఆర్‌సీపీ నేతలను పీఎస్‌కు పిలిపించి విచారణ  చేపట్టారు. కడప నగర వైయస్‌ఆర్‌సీపీ నాయకులు షఫీ,ఆదిత్య,అల్తాఫ్,రవి తదితర నాయకులను పోలీసులు విచారించారు. దరఖాస్తులో ఎవరి పేరుంటే వారిపై నిందమోపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వైయస్‌ఆర్‌సీపీ నేతల పేర్లపైనే 5వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.  మాకు తెలియకుండా మా పేర్లపై ఎవరో దరఖాస్తు చేసారన్నా పోలీసులు పట్టించుకోవడం లేదని వైయస్‌ఆర్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులను వైయస్‌ఆర్‌సీపీ వైపు నెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకే కొత్త కుట్ర జరుగుతుందని  వైయస్‌ఆర్‌సీపీ నేతలు ఆరోపించారు. 

Back to Top