కష్టపడి పనిచేసేవారికి టీడీపీలో గౌరవం లేదు

వైయస్‌ఆర్‌సీసీలోకి ఎంపీ తోట నరసింహం,తోట వాణి

వైయస్‌ జగన్‌తోనే అన్ని వర్గాలకు మేలు

హైదరాబాద్‌: వైయస్‌ జగన్‌ సమక్షంలో ఎంపీ తోట నరసింహం,తోట వాణి వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు.వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు.కష్టపడి పనిచేసేవారికి  తెలుగుదేశం పార్టీలో గౌరవం లేదన్నారు..అనారోగ్యంతో ఉన్న  నన్ను  తెలుగుదేశం పార్టీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో జక్కంపూడి రామ్మోహన్‌రావు ఆర్‌ అండ్‌ బి శాఖమంత్రిగా ఉన్నారని, ఆయనకు అనారోగ్యం కారణంగా ఒత్తిడి తగ్గించడానికి  ఎక్సైజ్‌మంత్రిగా పదవిని మార్పు చేశారన్నారు.

వైయస్‌ఆర్‌  చిత్తశుద్ధితో పనిచేసేవారని గుర్తుచేశారు.అనారోగ్యంతో ఉన్న నన్ను  తెలుగుదేశం పట్టించుకోలేదన్నారు.వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.వైయస్‌ జగన్‌తోనే అన్నివర్గాలకు మేలు జరుగుతుందన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top