హైదరాబాద్: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు మొదలయ్యాయి. మొన్న చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, నిన్న అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్, నేడు అమలాపురం ఎంపీ రవీంద్రబాబు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైయస్ జగన్ నివాసంలో అమలాపురం టీడీపీ ఎంపీ రవీంద్రబాబు జననేతతో భేటీ అయ్యారు. చంద్రబాబు నియంత పాలనతో విసిగిపోయిన టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుతున్నారు.
రెండ్రోజుల క్రితం ఆళ్లగడ్డకు చెందిన టీడీపీ ఇన్‌చార్జి ఇరిగెల రామపుల్లారెడ్డి సోదరులు వైయస్ జగన్‌ను కలిసి వైయస్‌ఆర్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇవాళ కూడా గిద్దలూరుకు చెందిన పలువురు టీడీపీ నేతలు అన్నా రాంబాబు నేతృత్వంలో వైయస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. వరుస చేరికలతో అధికార పార్టీలో గుబులు మొదలైంది. దీనికి తోడు నిన్న ఏలూరులో జరిగిన బీసీ గర్జనలో వైయస్ జగన్ వరాల జల్లులు కురిపించడం, బీసీ డిక్లరేషన్‌పై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు హర్షాతీరేకాలు వ్యక్తం చేస్తున్నారు.