వైయస్‌ఆర్‌సీపీలోకి మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి

వైయస్‌ జగన్‌ ఆశయాల కోసం సైనికుడిలా పనిచేస్తా

టీడీపీతో రాష్ట్రానికి అన్యాయం

వైయస్‌ఆర్‌సీపీతోనే రాష్ట్రాభివృద్ధి

హైదరాబాద్‌: ఇటీవల టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సీనియర్‌ నేత మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు. ఆయనకు వైయస్‌ జగన్‌ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.రాష్ట భవిష్యత్‌ కోసం ఆహర్నిశలు శ్రమిస్తున్న మనందరి ఆశాజ్యోతి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆశయాలు కోసం సైనికుడిలా పనిచేస్తానని ఆయన తెలిపారు.రాష్టాభివృద్ధి కోసం వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలనే దృఢ సంకల్పంతో వైయస్‌ఆర్‌సీపీలోకి చేరినట్లు తెలిపారు. వైయస్‌ఆర్‌సీపీ పార్టీని గెలుపు భుజస్కందాలపై వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి  సీఎం చేయడమే లక్ష్యమన్నారు.టీడీపీతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందన్నారు.వైయస్‌ జగన్‌ నాయకత్వంలోనే ఏపీకి న్యాయం జరుగుతుందనే నమ్మకంతో వైయస్‌ఆర్‌సీపీలోకి చేరినట్లు తెలిపారు. 

Back to Top