వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌

 త్వ‌ర‌లో వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌
 

హైదరాబాద్‌: అధికార తెలుగు దేశం పార్టీకి కౌంట్ డౌన్ మొద‌లైంది. చంద్ర‌బాబు అనుస‌రిస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక పాల‌న‌ను వ్య‌తిరేకిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్క‌రుగా రాజీనామా చేసి ప్ర‌తిప‌క్ష వైయ‌స్ఆర్ సీపీలో చేరుతున్నారు. గ‌త నెల‌లో వైయ‌స్ఆర్ జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మ‌ల్లికార్జున‌రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి జ‌న‌వ‌రి 31న వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. తాజాగా ప్రకాశం జిల్లాలో టీడీపీ చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు పంపించారు.

చీరాల నియోజకవర్గంలో కొన్ని శక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తున్నానని, ప్రభుత్వం, పార్టీకి సంబంధం లేని శక్తులు అక్కడ పని చేస్తున్నాయని, అందుకే తాను టీడీపీకి రాజీనామ చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆమంచి తన లేఖలో పేర్కొన్నారు.  కొద్దిసేప‌టి క్రిత‌మే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి హైద‌రాబాద్‌లో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లిశారు. త్వ‌ర‌లోనే పార్టీలో చేర‌నున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.  

తాజా ఫోటోలు

Back to Top