టీడీపీ మైనారిటీ కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డి

వైయ‌స్ఆర్ జిల్లా: మైదుకూరు నియోజవర్గ శాసనసభ్యులు శెట్టిపల్లె రఘురామి రెడ్డి  ఆధ్వర్యంలో  తెలుగుదేశం పార్టీకి చెందిన 20 ముస్లిం కుటుంబాలు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. మంగ‌ళ‌వారం ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ముస్లింలు ఎమ్మెల్యే స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీ గూటికి చేరారు.వారికి ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డి కండువాలు క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంక్షేమ‌, అభివృద్ధి పాల‌న‌కు ఆక‌ర్శితులై వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన‌ట్లు ఇమామ్ హుస్సేన్, కాసిం సాబ్, నాయబ్ రసూల్, ఖాజా మొద్దిన్ హాజముద్దీన్ తెలిపారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని మ‌ళ్లీ ముఖ్య‌మంత్రిని చేసుకుంటామ‌ని చెప్పారు.

Back to Top