టీడీపీ భవిష్యత్తుపైనే ఆ పార్టీ నేత‌ల‌ ఆందోళన

మంత్రి కుర‌సాల కన్నబాబు

మహానాడు సాక్షిగా తెలుగు డ్రామా పార్టీ వీడియో లీక్ అవడంతో డైవర్షన్ పాలిటిక్స్

కరోనా కష్టకాలంలోనూ రూ. 1.31 లక్షల కోట్లు పేదలకు ఇచ్చారనే కడుపుమంట టీడీపిది 

జన్మభూమి కమిటీల్లేకుండా నేరుగా ప్రజల ఖాతాల్లో డబ్బులు వేస్తుంటే టీడీపీకి ఎందుకు బాధ 

పెద్దగీతను చిన్నది చేయటానికి చేసే ప్రయత్నమే చంద్రబాబు జీవితం 

కోవిడ్‌ లేని రోజుల్లో, 5ఏళ్ళల్లో రాష్ట్రం అప్పు ఏకంగా రూ. 1.5 లక్షల కోట్లు ఎలా పెరిగిందో చెప్పాలి 

టీడీపీ కొంతమంది శ్రేయస్సు కోసం పనిచేస్తే.. సకల జనావళి శ్రేయస్సే లక్ష్యంగా సీఎం వైయ‌స్‌ జగన్ పరిపాలన.

పెట్రో ధరలు పెరిగినప్పుడల్లా ఆ భారాన్ని గతంలో మీరు ఎప్పుడైనా భరించారా బాబూ..?

ప్రాజెక్టుల పేరుతో రూ. 68 కోట్లు తినేసిన వ్యవహారాన్ని కేపిటల్ ఎక్స్ పెండిచర్ అంటారా..?

ఉచిత సలహాలు మాని, నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరించండి

సీఎం వైయ‌స్ జగన్ పరిపాల‌న‌ దక్షత వల్లే అన్ని రంగాల్లో రాష్ట్రం పురోగతి

తాడేప‌ల్లి:   రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద కాదు.. టీడీపీ భవిష్యత్తుపైనే ఆ పార్టీ నేత‌ల‌ ఆందోళన చెందుతున్నార‌ని మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు పేర్కొన్నారు. చంద్రబాబు కుట్రల్లో కుడిభుజంగా ఉండే యనమల రామకృష్ణుడు ఒకవైపు మీడియాలో.. ఆయన కుమారుడు లోకేష్ మరోవైపు ట్విట్టర్ లో వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డిగారిపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. సీఎం వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిగారి పరిపాలన రెండేళ్ళు పూర్తై, మూడో ఏట అడుగు పెడుతున్న సందర్భంలో, రూ. 1.31 లక్షల కోట్లు నేరుగా ప్రజలకు అందించి, సంక్షేమం, అభివృద్ధికి నిజమైన అర్థం చెప్పిన పరిస్థితుల్లో, దీనిమీద ప్రజల్లో చర్చ జరగకూడదని టీడీపీ నేతలు ఇటువంటి మాటలే మాట్లాడతారని అనుకున్నామ‌న్నారు. టీడీపీ నేత‌ల ఆరోప‌ణ‌ల‌ను మంత్రి క‌న్న‌బాబు తీవ్రంగా ఖండించారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. 

ఈరోజు యనమల, లోకేష్ ఇద్దరూ తయారైపోయి... అవాకులు, చవాకులు, అసత్యాలు ప్రచారం చేయడం మొదలు పెట్టారు. ఒక మంచి జరిగితే.. దానిని డైవర్షన్ చేయడమనేది వీళ్ళకు వెన్నతో పెట్టిన విద్య. ఈ ముఖ్యమంత్రి గారికి మంచి పేరు రాకూడదన్నదే వీరి కుట్ర.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడికి ఆందోళనగా ఉందట. బహుశా ఆయన ఆందోళన అంతా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద కాదు, టీడీపీ పరిస్థితి మీద చాలా ఆందోళనగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడినట్టు, పార్టీ లేదు.. బొక్కా లేదు అన్నది ఆ పార్టీలో కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు చాలా క్లారిటీగా ఉన్నారు. టీడీపీ మీద ఉన్న ఆందోళనను  రాష్ట్రం మీద మమకారంగా చూపటానికి నానా తంటాలు పడుతున్నారు. 

 దానిని వదిలేసి, యనమల రామకృష్ణుడుకి రాష్ట్రం మీద ప్రేమ ఉన్నట్టు నీతులు, సుద్దులు వల్లిస్తున్నారు. చంద్రబాబు 5 ఏళ్ళ పాలనలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు,  ఆర్థిక మంత్రిగా యనమల వీళ్ళు ఇద్దరూ రాష్ట్రాన్ని ఏం చేశారో చూశాం. గతాన్ని ప్రజలు కూడా మరిచిపోయారామో అని బహుశా వీళ్ళకు వీళ్ళు అనుకుంటున్నారేమో. 

కేపిటల్ ఎక్స్ పెండిచర్ అని కట్టని సెక్రటేరియేట్, అసెంబ్లీని, పూర్తికాని సాగునీటి ప్రాజెక్టులు, సగం సగం కట్టిన భవనాలను, తాత్కాలికంగా కట్టిన పట్టిసీమను... చూపించి తమ 5 ఏళ్ళ పాలనలో ఏ విధంగా తిన్నారో చూశాం.  సుమారు రూ. 68 వేల కోట్లు ప్రాజెక్టుల పేరుమీద తినేసిన వ్యవహారాన్ని క్యాపిటల్ ఎక్స్ పెండిచర్ అంటారా..?

  బాబు హయాంలో దోపిడీ లోతుపాతులేంటో యనమలకు తెలియదా..? 
  టీడీపీ పాలనలో దోపిడీ ఎలా జరిగింది, వాటి లోతుపాతులేంటి, ఆరోజు ఏ విధంగా చంద్రబాబు కథ నడిపించారో యనమలకు తెలియదా..?  రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రం బాగుండాలని ప్రజలు కోరుకుంటే... ప్రజలను పచ్చిగా దగా చేసి, దారుణంగా మోసం చేసినందువల్లే 2019 ఎన్నికల్లో వీళ్ళు ఫలితాన్ని అనుభవించారు.  ఇప్పుడు నీతులు చెబుతున్నారు. అప్పులు ఎక్కువ చేశారు అని మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో 86 శాతం మంది ప్రజలందరికి రూ. 1.31 లక్షల కోట్లు ఇచ్చారనే బాధ సహజంగానే టీడీపీకి ఉంటుంది. 

గతంలో ఏ పథకమైనా అందాలంటే... జన్మభూమి కమిటీల దగ్గరకో, పచ్చ కార్యకర్తల వద్దకో వెళ్ళాల్సిన పరిస్థితి. ఇప్పుడు నేరుగా ప్రజల అకౌంట్లలోనే వేస్తుంటే.. టీడీపీ నేతలకు కడుపు మండకుండా ఎలా ఉంటుంది. 

 మీరు చేసిన అప్పుల సంగతేంటి..? 
 కోవిడ్ వంటి కష్టం రానప్పుడు, రాష్ట్ర విభజన తర్వాత మీరు చేసిన అప్పులెన్ని, వాటిని దేనికి వినియోగించారో చెబుతారా యనమల రామకృష్ణుడు..?  కేవలం 5 ఏళ్ళ కాలంలో రాష్ట్రం అప్పు ఏకంగా రూ. 1.5 లక్షల కోట్లు ఎలా పెరిగింది.. ? అంటే యనమల వద్ద సమాధానం లేదు.  అప్పు చేసి, పేదలకు పంచారా అంటే అదీ లేదు. రూ. 87 వేల కోట్లు రైతు రుణ మాఫీ చేస్తానని చేశారా..? అక్కచెల్లెమ్మెలకు డ్వాక్రా రుణాలను మాఫీ చేశారా.. ? మీరు ఏం చేశారు అంటే, కేవలం మీ అవినీతి కార్యకలాపాల కోసం ఖర్చు పెట్టారు. ఇప్పుడున్న పథకాల్లో ఏవైనా మీ హయాంలో ఉన్నాయా? ఆ డబ్బు మనుషులు తిన్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం ఇస్తే బాగుంటుంది. 

 ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా కరోనా విపత్తు వచ్చినా.. ఏ ఒక్క పేద కుటుంబం ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో, అప్పులు చేసైనా సరే సంక్షేమ పథకాలను అమలు చేయాలని, అప్పుడు మాత్రమే ఈ విపత్తు నుంచి చిన్న, సన్నకారు కుటుంబాలు బయట పడతాయని ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్ జగన్ నమ్మి అమలు చేస్తున్నారు.  కోవిడ్ లో కూడా రాష్ట్రంలో ఏ పథకమూ ఆగలేదు. రెండేళ్ళలో ఎటువంటి సిఫార్సులు, అవినీతికి తావు లేకుండా డీబీటీ ద్వారా నేరుగా రూ. 1.31 లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చామని చెప్పాం. రైతు భరోసా మొదలుకొని అమ్మ ఒడి వరకు ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని క్యాలెండర్ ప్రకారం అమలు చేస్తున్నాం.  ఇవన్నీ కళ్ళకు కనిపిస్తున్నవే,  ఇది ప్రజల సంక్షేమం కోసం కాదా..? యనమల లాంటి మేధావులకు ఎందుకు కనిపించటం లేదు..? కరోనా కష్టకాలంలోనూ ప్రజలకు నిబ్బరాన్ని ఇచ్చి,  వారిని నిలబెడుతున్నామన్న నిజం మీకు అర్థం కాకపోతే.. మీరు నిజజీవితంలో నటిస్తున్నారా లేక అవగాహన కావడం లేదా..?

 మహానాడు సాక్షిగా టీడీపీ డ్రామా లీక్ కావడంతో ఆందోళన 
 మహానాడు సందర్భంగా..  చంద్రబాబు నిర్వహించిన  రిహార్సల్స్ లో చంద్రబాబు, యనమల, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వీడియో లీక్ కావడంతో.. వారి నిజస్వరూపం ఏమిటో, వారి రాజకీయ డ్రామాలు ఏమిటో ప్రజలకు తెలిసిపోయాయి. 
 ఆ వీడియో లీక్ లో పార్టీకి ఎస్టీలు, మైనార్టీలు, బీసీల్లో చాలా మంది దూరమయ్యారు అని సోమిరెడ్డి చెబుతున్నాడు. ఇవన్నీ నిజమేనని యనమల చెప్పారు. అయితే, ఇవన్నీ నిజమైనా బయటకు రాకుండా మాట్లాడండి అని చంద్రబాబు చెబుతున్నాడు.  తెల్లారి లేస్తే... టీడీపీ అంతా డ్రామా తప్పితే.. నిజం ఉండదు. అందుకే టీడీపీ అంటే తెలుగు డ్రామాల పార్టీ అని మేం మొదటి నుంచీ చెబుతున్నాం. 

తిరుపతి ఉన్న ఎన్నిక సమయంలో టీడీపీ  రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఏం చెప్పాడో చూశాం. పార్టీ లేదు, బొక్కా లేదన్నాడు. ఇప్పుడేమో వాళ్ళ పార్టీ నాయకులే.. అన్ని వర్గాలు దూరమయ్యాయని చెప్పారు. అంటే టీడీపీ పరిస్థితి ఏమిటో వేరే చెప్పనక్కర్లేదు. 

టీడీపీ సర్టిఫికేట్ అవసరం లేదు.. ప్రజల దీవెనలు చాలు
రెండేళ్ళ పరిపాలన పూర్తైన సందర్భంగా..  ముఖ్యమంత్రి పుస్తకం విడుదల చేస్తే..  టీడీపీ నుంచి సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏ వర్గానికి ఎంత మేలు చేశామో మేం గణాంకాలతో సహా చెబుతున్నాం. ప్రతి గ్రామ సచివాలయాల్లో, నేరుగా లబ్ధిదారుడు ఎవరు, ఏ పథకానికి ఎంత ఇచ్చామో కూడా ప్రకటన ఇస్తున్నాం. 

డ్రామాలను నమ్ముకునే చంద్రబాబు ఇంతకాలం పబ్బం గడుపుకుంటున్నాడు. రాష్ట్రంలో అడుగు పెట్టకుండా హైదరాబాద్ లో కూర్చుని, రోజూ జూమ్ లో ఏదొక కథ అల్లడం, దానిని డ్రామా చేయడం, ఆ తర్వాత వారి అనుకూల మీడియాలో పెద్దఎత్తున చూపించుకుని ఆనందపడిపోయి నిద్రపోవడం.. చంద్రబాబుకు రోజువారీ కార్యక్రమంగా మారింది. 

నిన్నటివరకు వేరే పార్టీ నాయకుడితో ఏ డ్రామాలు చేయించారో, వాటిని మీడియాలో ఎలా రక్తికట్టించారో, వాటికి చంద్రబాబు ఏవిధంగా నేపథ్యగానం అందించారో చూశాం.  ఒక డ్రామా ఆడితే... నేరం మీద దర్యాప్తునుంచి తాత్కాలికంగా అయినా తప్పుకోవచ్చన్నది చంద్రబాబు థియరీ. ఈ థియరీ ద్వారా ఇటీవల ఒక డ్రామాకు డైరెక్షన్, నిర్మాతగా తానే నడిపాడు. చివరికి సుప్రీం కోర్టులో అయినా బెయిల్‌ తెచ్చుకోవచ్చు అన్నది చంద్రబాబు థియరీ.

ఈ థియరీలో భాగంగానే...  ఒక డ్రామా మొదలుపెట్టారు. కథ– స్క్రీన్‌ప్లే– మాటలు, దర్శకత్వం... చంద్రబాబు నాయుడు. జైల్లోనే కత్తి దొరికిందన్నారు. కేంద్రంలో పెద్దలందరికీ ఉత్తరాలు రాస్తారు. చట్టానికి చిక్కకుండా... కొందరిని రక్షించుకోవాలన్నది, తద్వారా తానేదో గొప్ప విజయం సాధించానని, వ్యవస్థలన్నీ తన అధీనంలో ఉన్నాయని చూపించుకోవాలన్నది చంద్రబాబు వ్యూహం. 

ఓడిపోతే ఫ్రస్ట్రేషన్ ఇలా ఉంటుందా..
ఒక నాయకుడు ఓడిపోతే.. ఫ్రస్ట్రేషన్ ఏ విధంగా ఉంటుందో చంద్రబాబును చూస్తే అర్థమవుతుంది. ఎవరు కూడా రోజులో 24 గంటలూ,  తనను ఓడించిన నాయకుడిని దుమ్మెత్తిపోయడానికి, వారి పరపతిని తగ్గించడానికి కుట్రలు చేయడం చంద్రబాబుకు తెలిసినంతగా బహుశా దేశంలో ఎవరికీ తెలియవు. 

లోకేష్ ట్విట్టర్లో కూస్తున్నాడు. గత 5 ఏళ్లలో మీ ముద్ర ఉన్న పథకం, మీ బ్రెయిన్ చైల్డ్.. ఒక్కటైనా ఒక్క పథకమైనా ఉందేమో చూపెట్టండి.  మీరు ఎన్నికల ముందు ఇస్తామన్న రుణ మాఫీ చేయకుండా చివరిలో పుసుపు, కుంకుమ అంటే ప్రజలు ఉప్పు, కారం పెట్టారు. ఇలాంటి చెత్త కార్యక్రమాలు తప్ప, పది మందికి మంచి చేసిన చరిత్ర చంద్రబాబుకు లేదు. ఆయన పేరు చెపితే గుర్తుకు వచ్చే ఒక్క సంక్షేమ పథకం లేదు. మీడియాను వాడుకోవడం, వ్యవస్థలను మేనేజ్ చేయడం వల్ల అధికారం చేపడతాం అనేది మీ ఆశ. అది జరగదు. 

16 మెడికల్ కాలేజీలు కొత్తగా తీసుకురాబోతున్నాం. వీటి మీద చర్చ జరగకూడదు.  పాడేరు దగ్గర మొదలు పెట్టి పల్నాడు వరకు.. నిన్న ఒక్కరోజే 14 మెడికల్ కాలేజీలకు ముఖ్యమంత్రి జగన్ గారు శంఖుస్థాపన చేశారు. గతంలో ఇంత పెద్ద సంకల్పంగానీ, ఆలోచనగానీ చేసిన ముఖ్యమంత్రి ఎవరూ కనిపించరు. ఫిషింగ్‌ హార్బర్ల సహా సముద్ర తీరంలో ఎగుమతుల రంగంలో రాబోతున్న మార్పుల మీద చర్చ జరగకూడదు.  మీరు ఎందుకు పక్కదారి పట్టిస్తున్నారో చూస్తున్నాం. మెడికల్ కాలేజీల మీద, వ్యవసాయ రంగం మీద, కొత్తగా వచ్చిన పరిశ్రమల మీద, మహిళా సాధికారత మీద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇస్తున్న పథకాల మీద చర్చ జరగకూడదు. ఇదీ చంద్రబాబు ఆలోచన. 

పెద్దగీతను చిన్నది చేయటానికి చేసే ప్రయత్నమే బాబు జీవితం
పెద్దగీతను చిన్నది చేయటానికి చేసే ప్రయత్నమే ఆయన జీవితం. ఆయన ఎప్పటికీ పెద్దవాడు కాలేడు. వైయ‌స్‌ జగన్ గారికి సంబంధించి రూ. 43 వేల కోట్లు చార్జిషీట్ లో ఉన్నాయని వీళ్ళు మాట్లాడుతున్నారు. అంతకుముందు రూ. లక్ష కోట్లు అని ప్రచారం చేశారు. ఆరోజు సోనియా గాంధీతో చంద్రబాబు, టీడీపీ నేతలు కుమ్మక్కై నడిపించిన రాజకీయ ప్రేరేపిత కేసు అని అందరికీ తెలుసు. 

 ఈరోజు ప్రజా న్యాయస్థానంలో తిరుగులేని తీర్పును జగన్ గారు పొందారు. అదే విధంగా రేపు న్యాయస్థానంలోనూ అదే తీర్పు వస్తుందని మేం నమ్ముతున్నాం.  రోజురోజుకీ పాతాళంలోకి కూరుకుపోతామని అర్థమై, తన కొడుకు రాజకీయంగా ఎదగలేకపోతున్నాడనే బాధతో చంద్రబాబు మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది.  కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర బడ్జెట్ ను ఆర్డినెన్స్ లు రూపంలో  పెట్టడం తప్పా..?  ఈ పరిస్థితుల్లో ఆర్డినెన్స్ లు పెట్టక ఎవరైనా ఏం చేస్తారు. గవర్నర్ ను తప్పు బడుతున్నారు. వీళ్ళకు వీళ్ళే తీర్పులు ఇచ్చేస్తున్నారు. 

రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు పెడితే.. ఒక్క రోజు కూడా అసెంబ్లీకి రాని మీరు తప్పు అని మాట్లాడటానికి సిగ్గు ఎక్కడ లేదు.  ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి, ఈరోజు రాకుండానే ఎలా బాగుపడుతుందని..  గొప్ప ఆర్థిక మేధావిలా యనమల  మాట్లాడుతున్నారు. ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీనే ముద్దు అని మీరు ఆరోజు పండగలు చేసుకుంటారు. ప్రత్యేక హోదానే రాష్ట్రానికి సంజీవని అని, హోదా కోసం నిరాహార దీక్షలు చేసిందీ, పోరాడిందీ జగన్ గారు ఒక్కరే. 

సీఎం వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డిగారి పరిపాలన దక్షత వల్లే ఈరోజు అన్ని రంగాల్లో రాష్ట్రం పురోగతి చెందుతుంది.  పైగా ఇన్ని వేల కోట్ల రూపాయలు పంచితే.. పేదరికం ఎందుకు పోవడం లేదని వితండవాదన చేస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి పేదలకు దేశ వ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. పేదరికి రాత్రికి రాత్రి పోతుందా..? మీరు కొన్ని వర్గాల శ్రేయస్సు కోసం మాత్రమే పనిచేశారు. జగన్ మోహన్ రెడ్డిగారు అందరి పేదరికం పోగొట్టాలని చూస్తున్నారు. 

టీడీపీని ఓడిపోవడంతోనే రాష్ట్రం సగం బాగుపడింది. మీ హయాంలో 5 ఏళ్ళ కాలంలో మీరు చేసిన దోపిడీలు ఏమిటో, అరాచకాలు, దుర్మార్గాలు ఏమిటో,  మీ నిజ స్వరూపం అంతా ప్రజలకు తెలిసిపోయింది. అమరావతి వెనుక మీ కుట్ర ఏమిటో ప్రజలకు తెలిసింది.  మచ్చలన్నీ మీ కింద పెట్టుకుని మాపై విమర్శలా..

ఆర్టికల్ 19 గురించి మాట్లాడుతున్నారు. 425 ఆర్టికల్స్ ఉన్నాయి. మీ ఒక్కరికి మాత్రమే అన్నిరకాల స్వేచ్ఛలు ఉన్నట్టు, మిగతా వాళ్ళందరికీ మాట్లాడే హక్కు లేదన్నట్టుగా మీరు భావించడమే తప్పు. టీడీపీ హయాంలో ఎన్ని రాజద్రోహం కేసులు పెట్టారు.  30-40 రాజద్రోహం కేసులు పెట్టారు. ఒక్క కేటిఆర్ మీదే అరడజను కేసులు పెట్టారు. ముఖ్యమంత్రి ఫోన్ టాప్ చేస్తారా అని కూడా రాజద్రోహం కేసులు పెట్టారు. 

మీరు మాత్రమే చాలా గొప్ప వాళ్ళు అయినట్లుగా, మీరు మాత్రమే విజ్ఞత కలిగిన వారిగా పరిపాలించినట్టుగా, మీ జబ్బలు మీరే చరుచుకుంటున్నారు. ఈ ప్రభుత్వానికి ఎవరిపైనా కక్ష సాధించాల్సిన అవసరమే లేదు. ప్రజల అభిమానాన్ని ఏ విధంగా నిలబెట్టుకోవాలన్నదే టార్గెట్. ఎవరికైనా, అధికారంలోకి వచ్చిన తర్వాత పరపతి సన్నగిల్లుతూ వస్తుంది. కానీ, రెండేళ్ళ కాలంలో పంచాయతీ నుంచి మున్సిపల్, తిరుపతి ఉప ఎన్నిక వరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఏ విధంగా తీర్పు ఇచ్చారో చూశాం.  ఈ తీర్పులు, ఈ సర్టిఫికేట్లు అన్ని ప్రజలు ఇస్తున్నవి, క్షేత్రస్థాయి వరకు వైయస్ఆర్ కాంగ్రెస్ ను నమ్మాం. ముందుకు వెళ్ళండి అని ప్రజలు చెబుతున్న ధైర్యం కాదా..

మీ వరకే పత్రికా స్వేచ్ఛ, మీ వరకే హక్కులు.. ఎదుటి వాడికి ఏ హక్కులు లేవని భావించడమే తప్పు. దార్శనికత్వం, ప్రతి కుటుంబంలో మేలు జరగాలి, ప్రతి వ్యక్తికీ మేలు జరగాలి, విద్య, వైద్య, వ్యవసాయం, సంక్షేమ రంగాలన్నింటిలో తిరుగులేని పురోగతి సాధించాలనే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పని చేస్తుంది.  సమాజంలో సమతౌల్యత సాధించాలని చూస్తున్నాం. అగ్రకులాల్లో పేదలను కూడా ఆదుకుంటున్నాం. మీరు కొంతమంది శ్రేయస్సు మాత్రమే చూస్తే.. సకల జనావళి శ్రేయస్సు చూడటమే వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డిగారి నాయకత్వం. 

పెట్రోలు రేట్లు పెరిగితే.. ఆ భారాన్ని మీరు ఎప్పుడైనా భరించారా..? 
  పెట్రోలు రేట్లు పెరిగిపోతున్నాయని, వాటిని నియంత్రించండి అని కేంద్రానికి ఒక లేఖ రాయలేరు, రాష్ట్రానికి ఇతోధికంగా సాయం చేయండి అని ప్రతిపక్ష నాయకుడిగా కేంద్రానికి లేఖ రాయలేని అసమర్థ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు. ఎంతసేపటికీ గుడ్డ కాల్చిఅవతలివారిపై వేయడమే పని. పెట్రోలు ధరలు ఎవరు పెంచారు..? మీ హయాంలో పెరిగినప్పుడు మీరే భరించారా..?  మీరు మాత్రం చేయరుగానీ, ఉచిత సలహాలు ఇస్తారా అంటూ మంత్రి క‌న్న‌బాబు ప్ర‌తిప‌క్ష నేత‌లను ప్ర‌శ్నించారు.
 

Back to Top