కుప్పంలో టీడీపీ ప్ర‌లోభాల ప‌ర్వం

ఓట‌ర్ల‌కు డ‌బ్బులు పంచుతూ మీడియాకు అడ్డంగా దొరికిన టీడీపీ నేత‌లు

ఓటుకు రూ.4 వేలు, కుటుంబంలో న‌లుగురు మించి ఉంటే టీవీ, ఫ్రిడ్జ్ ఆఫ‌ర్ చేస్తున్న టీడీపీ

చిత్తూరు: కుప్పం మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ప్ప‌ద‌ని గ్ర‌హించిన చంద్ర‌బాబు.. ప్ర‌లోభాల ప‌ర్వానికి దిగారు. పంచాయ‌తీ, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో వైయ‌స్ఆర్ సీపీ చేతిలో ఘోర ఓట‌మిని చ‌విచూసిన చంద్ర‌బాబు.. కుప్పం మున్సిపాలిటీలో ఎలాగైనా నెగ్గాల‌ని దిగ‌జారుడు రాజ‌కీయాల‌కు తెర‌తీశారు. కుప్పం ఓట‌ర్ల‌కు తెలుగుదేశం పార్టీ నేత‌లు భారీగా న‌గ‌దు పంపిణీ చేస్తున్నారు. టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కుప్పంలో వార్డుల వారీగా తిరుగుతూ.. ``డబ్బులు తీసుకోండి.. ఓటేయండి`` అంటూ న‌గ‌దు వెద‌జ‌ల్లుతున్నారు. చంద్ర‌బాబు ప‌రువును కుప్పంలోనైనా కాపాడాల‌ని టీడీపీ నేత‌లు తెగ ఆరాట‌ప‌డుతున్నారు. ఓటుకు రూ.4వేల చొప్పున పంపిణీ చేస్తున్నారు. కుటుంబంలో నలుగురికి మించి ఉంటే, టీవీ, ఫ్రిడ్జ్‌లను కూడా టీడీపీ నేతలు ఆఫర్‌ ఇస్తున్నారు. ఓటర్లకు డబ్బులు పంచుతూ  టీడీపీ నేతలు మీడియాకు అడ్డంగా దొరికిపోయారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top