నెల్లూరు రూరల్ గ్రామాల్లో టీడీపీ ఖాళీ 

ఎంపీ ఆదాల స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలోకి టీడీపీ నేత‌లు

నెల్లూరు: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీ రోజు రోజుకు ఖాళీ అవుతోంది. వ‌రుస‌గా ఏదో గ్రామం నుంచి టీడీపీని వీడి వైయ‌స్ఆర్‌సీపీ గూటికి చేరుతున్నారు. తాజాగా మనవరప్పాడు గోటూరు వారి కండ్రిక నుండి డేగ గంగాధర్ ఆధ్వర్యంలో అల్లం సుధాకర్, పోకాటి వెంకట కృష్ణయ్య,రత్నమ్మ, ఎస్ డి బాబు, మునేంద్ర పెంచలయ్య, షేక్ మస్తాన్ వలి, షేక్ చిన్న, బంధుమిత్రులు సోమ‌వారం పార్లమెంటు సభ్యులు, నెల్లూరు రూరల్ ఇంచార్జ్ ఆదాల‌ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో  వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో చేరారు.  వారికి కండువాలు క‌ప్పి ఆదాల ప్ర‌భాక‌ర్‌రెడ్డి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు.

 వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు,నాయకుడుకు  అండగా ఉంటూ.. నెల్లూరు రూరల్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చేస్తాన‌ని ఆదాల హామీ ఇచ్చారు. 

 రేపు జరగబోయే ఎన్నికల్లో 18 గ్రామాలలో అత్యధిక భారీ మెజార్టీతో  ఆదాల ప్రభాకర‌రెడ్డిని గెలిపిస్తామ‌ని పార్టీలో చేరిన నాయ‌కులు పేర్కొన్నారు.  కార్యక్రమంలో  కేంద్ర సహకార బ్యాంక్ మాజీ చైర్మన్  ఆనం విజయ్ కుమార్ రెడ్డి , జీవీన్, సురేందర్ రెడ్డి,  రత్నయ్య, బెల్లంకొండ పెంచలయ్య, శివాజీ,  తదితరులు పాల్గొన్నారు.

Back to Top