నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీకి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తోటపల్లిగూడూరు మండలం, వరిగొండ గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నెల్లిపూడి సునీల్ రెడ్డి, తన అనుచరులతో టీడీపీకి రాజీనామా చేసి వైయస్ఆర్‌సీపీలో చేరారు. ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి సమక్షంలో టీడీపీ నేతలు భారీగా వైయస్ఆర్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం నానాటికీ పెరుగుతూ ఉంటే, తెలుగుదేశం పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో వరుస ఓటముల పాలవుతున్న వారిని అభ్యర్థిగా నిలబెట్టవలసిన దుస్థితి తప్ప, సమర్థవంతమైన నాయకులు తెలుగుదేశం పార్టీకి కనుచూపుమేర కనిపించడం లేదన్నారు. సీఎం వైయస్ జగన్ అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ, తిరుగులేని నాయకుడిగా ప్రజాబలం సంపాదించుకున్నారని తెలిపారు. రైతుల ధాన్యం విషయంలో డ్రామాలు ఆడటానికి వెళ్లి, ఇడిమేపల్లి గ్రామంలో పాలెపు పోలయ్య అనే రైతు చేతిలో భంగపడ్డారని గుర్తు చేశారు. రైతుల సమస్యల గురించి ఆలోచించి, వాటిని పరిష్కరించాలి తప్ప, పంచ కట్టుకొని తిరిగినంత మాత్రాన రైతుబాంధవులు కాలేరని హితవు పలికారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఏదో ఒకవిధంగా ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి అనేక రకాలైన ప్రయత్నాలు చేసి, చివరకు విఫలమయ్యారని చెప్పారు. సునీల్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడంతో పార్టీ మరింత బలోపేతమైందన్నారు.