వైయస్‌ జగన్‌తో మళ్లీ రాజన్న రాజ్యం...

రాష్ట్రవ్యాప్తంగా వైయస్‌ఆర్‌సీపీలోకి భారీ చేరికలు..

అమరావతిఐ  రాష్ట్రవ్యాప్తంగా వైయస్‌ఆర్‌సీపీలోకి వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున చేరుతున్నారు. వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి  సమర్థ నాయకత్వం,ఆశయం పట్ల ఆకర్షితులై అధిక సంఖ్యలో నేతలు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరడానికి మొగ్గుచూపుతున్నారు. వైయస్‌ జగన్‌తోనే ప్రజలకు మేలు జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.వైయస్‌ జగన్‌ రూపొందించిన నవరత్నా పథకాలు అద్భుతంగా ఉన్నాయని..ప్రజల్లో మంచి స్పందన వస్తుంది. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే నవరత్నాల ద్వారా మేలు జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్‌ నియోజకవర్గం కరప మండలం వేళంగి,శివారు దళమ్మ చెరువుగట్టు, యండమూరు గ్రామాలకు చెందిన టీడీపీకి చెందిన నాయకులు,కార్యకర్తలు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు.వైయస్‌ఆర్‌సీపీ కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వేళంగికి చెందిన 150 మంది, యండమూరు గ్రామానికి చెందిన సుమారు వందమంది పార్టీలోకి చేరారు. ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం నడవపల్లిలో బలుసుతిప్ప గ్రామానికి చెందిన అగ్నికుల క్షత్రియ యువత సంగాని సముద్రుడు,సంగాని శ్రీను,పొన్నాడ అన్నవరం,సంగాని ప్రసాద్‌తో పాటు 150 మంది వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు. పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ పొన్నాడ వెంకట సతీష్‌కుమార్‌ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

అనంతపురం జిల్లా : అనంతపురం రూరల్‌ మండలం ఏ.నారాయణపురం పంచాయతీ పాపంపేటకు చెందిన పలువురు టీడీపీ నాయకులు వైయస్‌ఆర్‌సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

చిత్తూరు జిల్లా : డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేదని నిన్ను నమ్మం బాబు అంటూ మదనపల్లిలోని స్థానిక వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో శిల్పారెడ్డి,షరీఫ్‌ ఆధ్వర్యంలో 13వ వార్డుకు చెందిన పలువురు డ్వాక్రా మహిళలు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు.ఎమ్మెల్యే డాక్టర్‌ దేశాయ్‌ తిప్పారెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

పశ్చిమగోదావరి జిల్లా : పెనుమంట్ర మండలం వెలగలేరులో వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త చెరుకువాడ శ్రీరంగనాథరాజు సమక్షంలో పలువురు గ్రామస్తులు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు.వారికి కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

నెల్లూరు జిల్లా : నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్‌ ఆధ్వర్యంలో 49వ డివిజన్‌కు చెందిన యువత వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు.పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. తిరిగి రాజన్న పాలన కావాలంటే వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సీఎం కావాలని అన్నారు. 

విశాఖపట్నం : విశాఖకు చెందిన రైల్వే యూనియన్‌ లీడర్,రిటైర్డ్‌ ఉద్యోగి వేల్పుల అజయ్‌కుమార్,అతని భార్య మాజీ కార్పొరేటర్‌ ప్రేమకుమారి వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు.లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు రాజన్న రాజ్యం మళ్లీ రావాలని కోరుకుంటున్నారని, వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వంలోనే అధి సాధ్యమవుతుందన్నారు.

 

తాజా వీడియోలు

Back to Top