టీడీపీ నేత‌లు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

జగనన్నతోనే రాష్ట్రాభివృద్ధి

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా

చిత్తూరు:  పన్నూరు, శ్రీహరిపురం, నార్పరాజుకండ్రిగ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు సుమారు 100 మంది బుధవారం వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర రైతు విభాగ ప్రధాన కార్యదర్శి డి.లక్ష్మీపతి రాజు ఆధ్వర్యంలో నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా సమక్షంలో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకిలో చేరారు. వీరికి ఎమ్మెల్యే రోజా కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జగనన్నతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే ఆర్‌కే రోజా అన్నారు.

పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర, నవరత్నాల పథకాలను చూసి పార్టీలో చేరుతున్నామని అన్నారు. టీడీపీలో పనిచేసే కార్యకర్తలకు, నాయకులకు గుర్తింపు లేదన్నారు. దొంగతనం, మోసాలు చేసే వారికి గుర్తింపు ఇస్తారని విమర్శించారు. ఎవరూ చేయని విధంగా ఎమ్మెల్యే ఆర్‌కే రోజా తన సొంత నిధులతో పేద ప్రజలకు రూ.4కే అన్నం, రూ.2కే మంచి నీరు, పాఠశాలలకు ఉచితంగా ఫ్యాన్లు ఇచ్చి ఆదుకుంటున్నారని తెలిపారు. ఆమె మంచితనం చూసి వైయ‌స్ఆర్‌సీపీలో చేరామని, పార్టీ గెలుపుకోసం పనిచేస్తామని తెలిపారు. పార్టీలో చేరిన వారు పద్మనాభరెడ్డి, కిషోర్‌రెడ్డి, హేమాద్రి, సూర్య, జగ, కుమార్‌ ఆచారి, దేవయాని, చిన్నబ్బతో పాటు 100 మంది ఉన్నారు.

 

Back to Top