టీడీపీ నేత సుభాష్ చంద్ర‌బోస్ వైయ‌స్ఆర్ సీపీలో చేరిక‌

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌మక్షంలో ప‌ల‌మ‌నేరుకు చెందిన టీడీపీ నేత ఆర్‌.వీ.సుభాష్ చంద్ర‌బోస్ వైయ‌స్ఆర్ సీపీలో చేరారు. ఈ మేర‌కు సుభాష్ చంద్ర‌బోస్‌కు కండువా క‌ప్పి పార్టీలో ఆహ్వానించారు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌. 2014 సార్వత్రిక ఎన్నికల్లో పలమనేరు నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సుభాష్‌ చంద్రబోస్ పోటీచేశారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌రిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్సీ కేఆర్‌జే భరత్, పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ పాల్గొన్నారు.

Back to Top