టీడీపీ నేత మున్వ‌ర్ వైయ‌స్ఆర్ సీపీలో చేరిక‌

నెల్లూరు: కార్పొరేషన్‌ ఎన్నికల సమయంలో ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీకి భారీ షాక్‌ తగిలింది. టీడీపీ నేత‌, వక్ఫ్‌ బోర్డు మాజీ చైర్మన్‌ మున్వర్ ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పారు. తన అనుచరులతో క‌లిసి ఇరిగేష‌న్ శాఖ మంత్రి డాక్ట‌ర్ అనిల్‌ కుమార్‌ యాదవ్‌ సమక్షంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా మున్వ‌ర్‌కు మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంత‌రం మంత్రి అనిల్‌ కుమార్ యాద‌వ్‌ మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా సీఎం వైయ‌స్ జగన్‌మోహ‌న్‌రెడ్డి అందిస్తున్న సంక్షేమానికి టీడీపీ నేతలు సైతం ఆకర్షితులవుతున్నారన్నారు. ప్రజాక్షేత్రంలో నిలబడే దమ్ములేక టీడీపీ అనైతిక పొత్తులకు పాల్పడుతోంద‌న్నారు. లోపాయికారి ఒప్పందాలతో కార్పొరేషన్‌ ఎన్నికల్లో లబ్ధికి ప్రయత్నిస్తోందని ధ్వ‌జ‌మెత్తారు. పార్టీల‌న్నీ క‌లిసివ‌చ్చినా ప్రజలు వైయ‌స్ఆర్ సీపీవైపే నిలుస్తారన్నారు. నెల్లూరు కార్పొరేష‌న్ ఎన్నిక‌లో వైయ‌స్ఆర్ సీపీదే విజ‌య‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. 

తాజా ఫోటోలు

Back to Top