వైయ‌స్ఆర్ సీపీలో చేరిన కాశీభ‌ట్ల సాయినాథ్ శ‌ర్మ‌

నంద్యాల‌: పలువురు టీడీపీ నేతలు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆళ్లగడ్డ నైట్‌ హాల్ట్‌ వద్ద వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ సమక్షంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ప‌లువురు నేత‌లు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైయ‌స్ఆర్‌ జిల్లా కమలాపురం నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి, అఖిలభారత బ్రాహ్మణ సంఘం మాజీ అధ్యక్షుడు కాశీభట్ల సాయినాథ్‌ శర్మ, ప‌లువురు యువ‌నేత‌లు సీఎం చేతుల మీదుగా వైయ‌స్ఆర్ సీపీ కండువా క‌ప్పుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి పాల్గొన్నారు. 

Back to Top