టీడీపీ నేత గోగుల వెంకట రమణ వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

తాడేప‌ల్లి:  విజ‌య‌వాడ‌లో టీడీపీకి మ‌రో భారీ షాక్ త‌గిలింది. టీడీపీ నేత, విజయవాడ మాజీ డిప్యూటీ మేయర్‌ గోగుల వెంకట రమణ సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి  వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి సమక్షంలో వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పార్టీ అధినేత‌, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వెంక‌ట‌ర‌మ‌ణ‌కు కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్య‌క్ర‌మంలో గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని), త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top