దోచుకున్న వేల కోట్లు కక్కిందాకా ప్రభుత్వం వదిలి పెట్టదు..

ట్విట‌ర్‌లో వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి 

న్యూఢిల్లీ: టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై  వైయ‌స్ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విటర్‌ వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్‌ను కల్పతరువులా భావించారని, అంచనాలు పెంచి ప్రతి పనిలో నిధులు దోచుకున్నారని విమర్శించారు. ప్రాజెక్ట్‌, జల విద్యుత్‌ కేంద్రం నిర్మాణాల్లో రూ.2343 కోట్లు కాంట్రాక్టర్లకు అదనంగా చెల్లించినట్లు నిపుణుల కమిటీ తేల్చిందని అన్నారు. ఇదీ కక్ష సాధింపేనంటారా బాబూ? అంటూ సూటిగా ప్రశ్నించారు. ‘పోలవరంపై రాజ్యసభలో నేను అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి చెప్పిన జవాబును చంద్రబాబుగారికి సరిగా బ్రీఫ్ చేసినట్టు లేరు. ప్రాజెక్టు అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు జరుపుకోవచ్చని మంత్రి స్పష్టం చేశారు. సీబీఐ రంగంలోకి రాదని మురిసిపోతున్నారేమో బాబుగారు. పోలవరంలో అవినీతి, విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందాలపైన కేంద్రం నుంచి క్లీన్‌చిట్ వచ్చినట్టు మురిసిపోతున్నారు పచ్చదొంగలు. నాలుగు రోజులు ఓపిక పట్టండి అన్నీ బయట పడతాయి. దోచుకున్న వేల కోట్లు కక్కిందాకా ప్రభుత్వం వదిలి పెట్టదు.’ అని విజయసాయి రెడ్డి ట్వీట్‌ చేశారు.

తాజా ఫోటోలు

Back to Top