టీడీపీ ముఖ్య నేత‌లు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

పార్టీలోకి ఆహ్వానించిన జెడ్పీ చైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు
 

విజ‌య‌న‌గ‌రం:  జిల్లాలో టీడీపీకి షాక్ త‌గిలింది. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌కు ఆక‌ర్శితులై ప‌లువురు టీడీపీ కీల‌క నేత‌లు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు.  కెల్లా గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు సుంకరి శ్రీను, ఆల్తి శ్రీను వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ సీనియ‌ర్ నేత‌, జెడ్పీ చైర్మ‌న్  మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  కార్యక్రమంలో ఎస్.కోట నియోజకవర్గం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు కే.వి సూర్యనారాయణ రాజు(పులి రాజు) ,ఉప సర్పంచ్ కొంచడా ఈశ్వరరావు, మాజీ ఎంపీటీసీలు  సూర్యనారాయణ, జగన్నాధం ,జిల్లా కో కన్వీనర్ కెల్లా సురేష్,  వైయ‌స్ఆర్‌సీపీ  నాయకులు పైడిరాజు, రాము నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Back to Top