కుప్పంలో టీడీపీ దౌర్జ‌న్యం

వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలపై దాడి
 

 చిత్తూరు జిల్లా: కుప్పం మున్సిపాలిటీలో నామినేషన్ల చివరి రోజు ఎంఎఫ్‌సీ ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడికి తెగబడ్డారు. 14వ వార్డుకు నామినేషన్‌ వేసేందుకు మునస్వామిపురానికి చెందిన వెంకటేష్‌ స్థానికేతరులతో కలిసి వస్తుండగా, వైయ‌స్సార్‌సీపీ నేతలు వారిని వారించారు. సంబంధంలేని వారు నామినేషన్‌ కేంద్రానికి ఎందుకు వచ్చారని నిలదీశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.

14వ వార్డు వైయ‌స్సార్‌సీపీ అభ్యర్థి మునస్వామి సమీప బంధువు అయిన వెంకటేష్‌పై టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్‌ వెంకటేష్‌ దాడి చేశాడు. ఇరువర్గాల మధ్య తోపులాటలు, వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పి పంపారు.  

తాజా ఫోటోలు

Back to Top