టీడీపీ శ్రేణుల దాడిని నిర‌సిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ ఆందోళ‌న‌

విజయవాడ:  విజయవాడలో వైయ‌స్ఆర్‌ సీపీ కార్పొరేటర్‌ భర్తపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. ఈ నేపథ్యంలో దాడిని నిరసిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు ఆందోళ‌న‌ చేపట్టారు.  పశ్చిమ నియోజకవర్గంలోని చెరువు సెంటర్‌లోని వైయ‌స్ఆర్‌సీపీ జెండా దిమ్మను టీడీపీ, జనసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా దిమ్మను ఎందుకు పగులగొట్టారని వైయ‌స్ఆర్‌సీపీ కార్పొరేటర్‌ మైలవరపు రత్నకుమారి, ఆమె భర్త దుర్గారావు ప్రశ్నించారు. దీంతో, పచ్చ బ్యాచ్‌ మరింత రెచ్చిపోయారు. అనంతరం, దుర్గారావుపై దాడి చేశారు. 

టీడీపీ, జనసేన కార్యకర్తల దాడిలో దుర్గారావు తీవ్రంగా గాయపడటంతో ఆయనను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా, దుర్గారావుపై దాడిని ఖండిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. దాడిని ఖండించారు. ఈ నిరసనల్లో విజయవాడ పశ్చిమ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌ఛార్జ్‌ షేక్‌ ఆసిఫ్‌, పార్టీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Back to Top