తండ్రి అడుగుజాడ‌ల్లోనే సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌..

మంత్రి తానేటి వ‌నిత‌
 

పశ్చిమ గోదావరి: దివంగత నేత వైయ‌స్‌ రాజశేఖర్ రెడ్డి పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి  అడుగుజాడల్లోనే ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి నడుస్తున్నారని, తండ్రిలాగే పేదల పక్షపాతిగా ఆయన‌ పని చేస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించారు.  బుధవారం వైయ‌స్సార్‌ 11వ వర్థంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలోని రాజాశేఖరరెడ్డి విగ్రహాంతో పాటు కొవ్వూరు పట్టణంలోని ఆయన విగ్రహాలకు మంత్రి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదే విధంగా పేదలకు వస్త్రాలు పంపిణీ చేయడమే కాకుండా వృద్ధులకు పండ్లు,రొట్టెలు పంచారు. అలాగే టీడీపీకి చెందిన పలువురు కార్యకర్తలకు పార్టీ కండువా కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top