ఆముదాలవలస నియోజకవర్గం అభివృద్దే ధ్యేయం

 వైయ‌స్ఆర్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని  చిరంజీవి నాగ్

ఆముదాలవలస :  ఆముదాలవలస నియోజకవర్గం అభివృద్దే... స్థానిక శాసనసభ్యులు, ఏపీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం ధ్యేయ‌మ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వెంకట చిరంజీవి నాగ్ స్పష్టం చేశారు. వ్యక్తిగత పోకడలుకు  పోకుండా,నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి ప్రయోజనాలు దక్కించుకోవడమే లక్ష్యంగా నాలుగు దశాబ్దాల రాజకీయ క్షేత్రంలో ప్రజాభిమానంతో అడుగులు వేస్తున్న ఏకైక నాయకుడు తమ్మినేని సీతారాం అన్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఆముదాలవలస నియోజకవర్గ అభివృద్ధితోపాటు, జిల్లా అభివృద్ధిలోనూ మంత్రిగా ఆయన అందించిన సేవలు నిరుపమానమైనవి అన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో ప్రఖ్యాతిగాంచిన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు. బూర్జ మండలం పెద్దపేట గ్రామం ఉద్యానవన పంటల అభివృద్ధిలో ఒక దిక్సూచిగా నిలవనుందన్నారు. ఇప్పటివరకు  ఉద్యానవన పరిశోధన కేంద్రాలు 19 ఉండగా,20 వ పరిశోధన కేంద్రాన్ని పెద్దపేట గ్రామంలో ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయం అన్నారు. హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ఏర్పాటు కోసం.. శాసనసభాపతి తమ్మినేని సీతారాం అలుపెరుగని కృషి చేశారన్నారు. స్పీకర్ విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిఆదేశాల‌తో  బూర్జ మండలం పెద్దపేట గ్రామంలో హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ఏర్పాటుకు అనుమతులు మంజూరు అయ్యాయని గుర్తు చేశారు. గత మే నెలలో వంద ఎకరాల విస్తీర్ణంలో ప్రఖ్యాతి గాంచిన ఉద్యానవన పరిశోధన సంస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఉన్నత కమిటీ వచ్చి వనరుల లభ్యత, హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ఏర్పాటు ఆవశ్యకత గూర్చి నివేదిక సమర్పించిందన్నారు. వైయస్సార్ హార్టికల్చర్ విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థగా ఇది కొనసాగనుందన్నారు. గ్రామంలో విత్తన అభివృద్ధి సంస్థ కు చెందిన 70 ఎకరాల భూమిని,వైయస్సార్ హార్టికల్చర్ విశ్వవిద్యాలయoకు  భూ బదలాయింపు జరిగడంతో,  సంస్థ కార్యకలాపాలు కొనసాగించేందుకు వీలుగా భవన నిర్మాణాలకు త్వరలో శంకుస్థాపన జరగనుందని తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు ఎంతో ప్రయోజనం గా నిలిచే ఉద్యానవన పరిశోధన కేంద్రాన్ని పెద్దపేట గ్రామానికి మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారికికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పొడవైన సముద్రతీరం ఉందన్నారు. విశాలమైన మైదాన ప్రాంతం,గిరిజన ప్రాంతాల్లో ఉద్యానవన సాగు అధికంగా సాగుతుందన్నారు.వ్యవసాయంపై పూర్తిగా ఆధారపడి జీవనం సాగించే రైతులు ఆర్ధికంగా మరింత ప్రయోజనం పొందేందుకు ఉధ్యానవన పంటలపై దృష్టి సారిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. జిల్లాల్లో కొబ్బరి, జీడిమామిడి, మునగ, అరటి తదితర పంటల పండించే రైతులకు ఈ కేంద్రం కల్పతరువు కానుందన్నారు. జిల్లాలో దాదాపు 3 లక్షల ఎకరాల్లో అన్ని రకాల ఉద్యాన పంటలు పండించే రైతులకు దీని ద్వారా విస్తృత సేవలు లభిస్తాయన్నారు..ఇక్కడ రైతాంగానికి ఉద్యానవన పంటల పై పూర్తి స్థాయిలో చైతన్యవంతం చేస్తే, విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటాయన్నారు. వ్యవసాయ రంగం జిల్లాలో ప్రగతి బాటలో పయనించనుందన్నారు. పొందూరు మండలం లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, ఆమదాలవలస మండలంలో తొగరాం గ్రామంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల,వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, సరుబుజ్జిలి మండలం లో వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల వంటివి సాధించుకోవడంలో స్పీకర్ తమ్మినేని సీతారాం విశేషమైన కృషి చేశారన్నారు. విద్యారంగంలో ఆమదాలవలస నియోజకవర్గానికి గుర్తింపు తీసుకురావడంలో సీతారాం కృషిని ప్రతి ఒక్కరు స్వాగతించాలని తమ్మినేని  చిరంజీవి నాగ్ పేర్కొన్నారు.

Back to Top