జేసీ దివాకర్‌రెడ్డి అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టాలి

త్రిశూల్‌ సిమెంట్స్‌ అనుమతుల రద్దును స్వాగతిస్తున్నాం

 తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి 

అనంతపురం : యాడికి మండలం కోన ఉప్పలపాడులో జేసీ దివాకర్‌రెడ్డికి చెందిన త్రిశూల్‌ ఫ్యాక్టరీ అనుమతులు రద్దును స్వాగతిస్తున్నామని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పేర్కొన్నారు. సిమెంట్‌ ఫ్యాక్టరీ భూములను అఖిలపక్ష నేతలతో కలిసి తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా పెద్దారెడ్డి మాట్లాడుతూ..   త్రిశూల్‌ సిమెంట్స్‌ పేరుతో జేసీ దివాకర్‌రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు. పరిశ్రమ స్థాపించి ఉద్యోగాలు కల్పించకుండా అన్యాయం చేశారని,రూ.200 కోట్ల విలువైన సున్నపురాయి గనులను జేసీ కొల్లగొట్టారని పేర్కొన్నారు.  జేసీ బ్రదర్స్‌ దొంగల కన్నా హీనమని, జేసీ దివాకర్‌రెడ్డి అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. దివాకర్‌రెడ్డిపై బినామి చట్టం కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని పెద్దారెడ్డి పేర్కొన్నారు.
 

తాజా వీడియోలు

Back to Top