ఆయనే అల్లూరి... ఆయనే మన జేమ్స్ బాండ్

సూపర్‌ స్టార్‌ కృష్ణ అస్తమయంపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్  సంతాపం

 తాడేపల్లి: తెలుగు సూపర్‌ స్టార్‌ ఘట్టమనేని కృష్ణ అకాల మ‌ర‌ణం ప‌ట్ల ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  సంతాపం తెలియజేశారు. ‘‘కృష్ణగారు తెలుగువారి సూపర్ స్టార్. ఆయనే అల్లూరి... ఆయనే మన జేమ్స్ బాండ్. నిజ జీవితంలో కూడా మనసున్న మనిషిగా, సినీరంగంలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న ఆయన మరణం తెలుగు సినీ రంగానికి, తెలుగు వారికి తీరని లోటు. మహేష్ కు, కృష్ణగారి కుటుంబ సభ్యులందరికీ ఈ కష్ట సమయంలో దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అని సీఎం వైయ‌స్‌ జగన్‌ తెలిపారు. ఘట్టమనేని కుటుంబంతో వైయ‌స్‌ కుటుంబానికి ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైంది అంటూ వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top