అబ‌ద్ధాలు, అస‌త్య వార్త‌ల‌కు స్వ‌స్తి చెప్పండి

పొర‌పాటును స‌వ‌రించుకున్నా రాద్ధాంతం చేయ‌డం దుర్మార్గం

ఎల్లో మీడియాపై ప్ర‌భుత్వ చీఫ్ విప్ గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి ధ్వ‌జం

తాడేప‌ల్లి: అబ‌ద్ధాలు, అస‌త్య వార్త‌ల‌కు ఇప్ప‌టికైనా స్వ‌స్తి చెప్పాల‌ని ప్ర‌భుత్వ చీఫ్ విప్ గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి ఎల్లోమీడియాపై ధ్వ‌జమెత్తారు. పొర‌పాటును స‌వ‌రించుకున్నా ఓ వ‌ర్గానికి చెందిన మీడియా రాద్ధాంతం చేయ‌డం దుర్మార్గ‌మ‌న్నారు. `నిన్న(జూలై 22) తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గంటకు కోట్ల రూపాయలు ఫీజులు తీసుకునే న్యాయవాదులను ఎలా పెట్టుకోగలిగారు.. ఆ డబ్బులు ఆయనకు ఎలా వస్తున్నాయి, ఎక్కడ నుంచి వస్తున్నాయి అని మాట్లాడుతూ.. న్యాయవాది అనబోయి పొరపాటున జడ్జి అన్న విషయం వాస్తవం. అది పొరపాటు. అయితే, వెనువెంటనే నా పొరపాటును సవరించుకుని న్యాయవాది అని చెప్పాను.

అయితే దానిని ఓ వర్గం మీడియా రాద్ధాంతం చేయటం దుర్మార్గం. జడ్జిలకు ఫీజులు ఎవరైనా ఇస్తారా..? కనీసం ఆమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా.. నేనేదో అనుచిత వ్యాఖ్యలు చేశానంటూ అభూతకల్పనలు సృష్టించటం బాధ్యతాయుతమైన మీడియా చేసే పని కాదు. ఇప్పటికైనా ఇటువంటి అబద్ధాలు, అసత్య వార్తలకు స్వస్తి చెప్పాలని కోరుతున్నాను.` అని గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

Back to Top