స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన సీఎం వైయస్‌ జగన్‌

 

వైయస్‌ఆర్‌ జిల్లా: వైయస్‌ఆర్‌ జిల్లా దశాబ్దాల కలను దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి తనయుడు, సీఎం వైయస్‌ జగన్‌ నెరవేర్చారు. కడప స్టీల్‌ ప్లాంట్‌కు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. జమ్మలమడుగులో సున్నపురాళ్లపల్లెకు చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌ స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు నెలల్లోనే శంకుస్థాపన చేశారు. స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి ప్రభుత్వం 3,200 ఎకరాల భూమిని, 2 టీఎంసీల నీటిని కేటాయించింది. ఏడాదికి 5 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల ఐరన్‌ ఓర్‌ సామర్థ్యంతో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మించనున్నారు. ఏడాదికి 3 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల ఐరన్‌ ఉత్పత్తి జరుగనుంది. స్టీల్‌ ప్లాంట్‌కు కావాల్సిన ఐరన్‌ ఓర్‌ కోసం ఎన్‌ఎండీసీతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. మూడు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా పులివెందుల, జమ్మలమడుగు, మైదుకూరు, కడప, రాయచోటి ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులకు సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపనలు చేయనున్నారు.

Back to Top