ఊరూరా సంబ‌రాలు

ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ముగింపు సంద‌ర్భంగా రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు

సేవా కార్య‌క్ర‌మాలు

అమ‌రావ‌తి: అసమర్థ పాలనను ఎండగడుతూ.. అభ్యాగులకు భరోసానిస్తూ ప్రజా సంకల్పయాత్రికుడు వైయ‌స్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ముగింపు సంద‌ర్భంగా రాష్ట్ర‌వ్యాప్తంగా పార్టీ శ్రేణులు సంబ‌రాలు చేసుకుంటున్నారు. జ‌న‌నేత ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని, రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి కావాల‌ని, పాద‌యాత్ర విజ‌య‌వంతం అయినందుకు ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు నిర్వ‌హించారు. ఊరూరా జనం పండుగ చేసుకుంటున్నారు. పేదల బతుకుల్లో చీకటి తెరలు తొలగించే వెలుగు రేఖలా కనిపించిన జననేతలో రాజన్నను చూసుకుంటామ‌ని పేర్కొంటున్నారు.

వైయ‌స్ఆర్ జిల్లా:

వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్ర ముగింపు సందర్భంగా కడప జిల్లా పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్ బాబు, ఎమ్మెల్యే అంజాద్ బాషా, నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్‌లు పాల్గొన్నారు.జిల్లాలోని ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు వైయ‌స్ జగన్ ప్రజాసంకల్పయాత్ర విజయవంతమైన సందర్భంగా సుండుపల్లి జెడ్‌పీటీసీ హకీం ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు వైయ‌స్ జగన్ ప్రజాసంకల్పయాత్ర విజయవంతమైన సందర్భంగా రాయచోటి వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో జిల్లా బీసీ ప్రధాన కార్యదర్శి విజయ భాస్కర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.  

కర్నూలు:

వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర ముగింపు నేపధ్యంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ఆనందోత్సవాలు జరుపుకున్నారు. వైయ‌స్ సర్కిల్లో దివంగత నేత వైయ‌స్ఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రాజా విష్ణు వర్దన్ రెడ్డి, నరసింహులు యాదవ్, తెర్నకల్ సురేందర్ రెడ్డి, రెహమాన్, మద్దయ్య, మున్నా తదితరులు పాల్గొన్నారు. ప్రజాసంకల్పయాత్ర ముగింపు సందర్భంగా  ఆత్మ‌కూరులో పార్టీ నాయ‌కులు ఎల్లారెడ్డి, మార్త భాస్క‌ర్‌, హ‌నుమంత‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో భారీ కేక్ క‌ట్ చేశారు. పాణ్యం నియోజకవర్గంలోని షరీన్ నగర్లో  వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు విశ్వేశ్వర్‌ రెడ్డి, యశ్వంత్ రెడ్డి, ఫిరోజ్, బెల్లం మహేశ్వర రెడ్డి, సులోచన, శ్రీనివాసులు, విక్రమ్, డేవిడ్‌లు దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలతో అభిషేకం, కేక్ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు.

అనంతపురం:
 వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు మద్దతుగా వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు రాయదుర్గం మండలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి ఉడేగొళం మధ్యనేశ్వర స్వామి దేవాలయం వరకు మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తనయుడు కాపు ప్రవిణ్ రెడ్డి ఆధ్వర్యంలో సంఘీభావ యాత్ర నిర్వహించారు. ఈ యాత్రకు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఉరవకొండ మండలం పెన్నహోబిలం శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూడేరు మండలం పి. నాగిరెడ్డిపల్లిలో సంఘీభావ పాదయాత్ర చేపట్టారు. విడపనకల్లు మండలం డోనేకల్లులో వైస్సార్సీపీ నేతలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.  

చిత్తూరు: 
ప్రజాసంకల్ప పాదయాత్ర ముగింపు సందర్భంగా  వైయ‌స్ఆర్‌సీపీ నేతలు పురుషోత్తం రెడ్డి, చంద్రశేఖర్, రాహుల్ రెడ్డి,లీనారెడ్డిలు, ఇతర కార్యకర్తలు గాంధీ సర్కిల్‌లో కేక్ కట్ చేసి అన్నదానం చేశారు. ప్రజాసంకల్పయాత్ర ముగింపు సందర్భంగా, వైఎస్ జగన్‌కు సంఘీభావం తెలియచేస్తూ పీలేరు, కలికిరి, కలకడ, వైవి పాలెం,గుర్రంకొండ, వాల్మీకి పురం మండలాలలో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ముగింపు సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో  వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు కేక్ కటింగ్‌, అన్నదాన కార్యక్రమం చేపట్టారు. తిరుప‌తిలో  వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతమైన సందర్భంగా యువజన విభాగం నేత భూమన అభినయ రెడ్డి నేతృత్వంలో తిరుపతిలోని అలిపిరి వద్ద పార్టీ శ్రేణులు కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కుసుమ కుమారి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఇమామ్, రాజేంద్ర, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

అనంతపురం:

వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్రకు మద్దతుగా ఎస్‌ కే యూనివర్సిటీ సమీపంలోని అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నాయకులు, ఆకుతోటపల్లి గ్రామస్థుల ప్రత్యేక పూజలు నిర్వహించారు. 101 టెంకాయలు కొట్టి వైయ‌స్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు.

నెల్లూరు:
వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర విజయవంతమైన సందర్భంగా రూరల్  వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు పిండి సురేష్, బొబ్బల శ్రీనివాస్ యాదవ్, కాకి వెంకటేశ్వర్లు భారీ కేక్‌ను కట్ చేశారు. మూడు నెలల్లో రాజన్న రాజ్యం రాబోతోందని, జిల్లాలో కచ్చితంగా 10 సీట్లు గెలుస్తామని బొబ్బల శ్రీనివాస్ యాదవ్‌ ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్రను విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్ధి విభాగం నాయకులు విష్ణు వర్దన్ రెడ్డి, మేర్లపాక వెంకటేష్, సందీప్‌, రాజేష్, యశ్వంత్, బన్నీ,నాగరాజులు నాయుడుపేటలోని శ్రీ పోలేరమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, 101టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు.  

విజయనగరం:
ప్రజాసంకల్పయాత్ర ముగింపు సభకు విజయనగరం నుంచి  భారీగా జనం తరలి వస్తున్నారు. ప్రజాసంకల్పయాత్ర ముగింపు సభకు నెల్లిమర్ల వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త బడుకొండ అప్పలనాయుడు ఆధ్వర్యంలో నెల్లిమర్ల నియెజకవర్గం నుంచి భారీగా వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు తరలి వస్తున్నారు. 

గుంటూరు: 
వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయ‌స్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతం అయిన సందర్భంగా  వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో 3648 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైన రోజు పాదయాత్ర విజయవంతం కావాలని స్వామివారికి మొక్కుకున్నారు. పాదయాత్ర విజయవంతం కావడంతో కార్యకర్తలు స్వామి వారికి కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కు చెల్లించుకున్నారు.

విశాఖపట్నం :

పెందుర్తి  వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయ కర్త అదీప్‌ రాజ్‌ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ప్రజాసంకల్పయాత్ర ముగింపు సభకు కారు ర్యాలీ ద్వారా ఇచ్ఛాపురానికి బయలుదేరారు.

Back to Top