రాష్ట్రవ్యాప్తంగా వైయస్‌ఆర్‌సీపీలోకి భారీ చేరికలు...

తెలుగుదేశం పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయింది...

వైయస్‌ఆర్‌సీపీతోనే మళ్లీ సంక్షేమ రాజ్యం...

రాష్ట్రవ్యాప్తంగా వైయస్‌ఆర్‌సీపీలోకి వివిధ వర్గాల నేతలు,కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుతున్నారు.టీడీపీ ప్రభుత్వం పాలనలో ప్రజలు విసిగిపోయారని,అవినీతి రాజ్యమేలుతుంది.వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రూపొందించిన నవరత్న పథకాలు,వైయస్‌ఆర్‌సీపీ ఆశయాలకు ఆకర్షితులై పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి.ఆచరణ సాధ్యం కాని వాగ్ధానాలతో అధికారం చేజిక్కించుకున్న తెలుగుదేశం పార్టీ నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో అవినీతిని పెంచి పోషించిందని, ఆ పార్టీ ప్రజల్లో పూర్తిగా విశ్వాసం కోల్పోయిందని,వైయస్‌ఆర్‌సీసీ ద్వారానే రాష్ట్రానికి మేలు జరుగుతుందనే నమ్మకంతో వైయస్‌ఆర్‌సీపీలోకి చేరుతున్నట్లు పార్టీలోకి చేరిన నేతలు,కార్యకర్తలు తెలిపారు.

అనంతపురం జిల్లాలో: 

వైయస్‌ఆర్‌సీపీ కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని రాప్తాడు నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అన్నారు.ఆయన సమక్షంలో పలువురు టీడీపీ నాయకులు,కార్యకర్తలు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు. పార్టీలోకి చేరినవారిలో ఎద్దులపల్లి కుళ్లాయప్ప,ఎద్దులపల్లి షెక్షావలి,అమీన్,సూర్యనారాయణ రెడ్డి,హనుమంతురెడ్డి, ఖాసీం,సిద్దన్న భాస్కర్, సుబ్బరాయుడు, హరిజన నాగన్న, లింగన్న,చండ్రాయుడు,నాగరాజు తదితరులు ఉన్నారు.

 చిత్తూరు జిల్లాలో..

 గుడిపాల మండలంలో టీడీపీ నుంచి 30 మంది వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు.మొగరాళ్లపల్లె పంచాయతీలోని రాసనపల్లె దళితవాడకు చెందిన వారికి వైయస్‌ఆర్‌సీపీ చిత్తూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లె శ్రీనివాసులు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలకు ఆకర్షితులై వైయస్‌ఆర్‌సీపీలోకి చేరామని తెలిపారు.రొంపిచెర్ల మండలంలో టీడీపీకి చెందిన 200 కుటుంబాలు పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలోకి చేరాయి.

తూర్పుగోదావరి జిల్లాలో

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోఆర్డినేటర్‌ జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో సీతానగరం మండలం చీపురపల్లి,నాగంపల్లి గ్రామాల్లో టీడీపీకి చెందిన పలువురు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు. వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

గుంటూరు జిల్లాలో: 

టీడీపీ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా మండలంలోని పాత చెరుకుంపాలెం,కొత్తచెరుకుంపాలెం,రెడ్డికొత్తూరు గ్రామాలకు చెందిన సుమారు 200 మంది టీడీపీ నేతలు,కార్యకర్తలు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు. నియోజకవర్గ ఇన్‌చార్జి బొల్లా బ్రహ్మనాయుడు సమక్షంలో చేరారు. వీరికి వైయస్‌ఆర్‌సీపీ పక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, నరసరావుపేట,గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తలు లావు శ్రీకృష్ణదేవరాయులు,కిలారి రోశయ్య, నియోజకవర్గ ఇన్‌చార్జి బ్రహ్మనాయుడు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

కృష్ణా జిల్లాలో:

ఆచరణ సాధ్యం కాని వాగ్ధానాలతో అధికారం చేజిక్కించుకున్న తెలుగుదేశం పార్టీ నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో అవినీతిని పెంచి పోషించిందని, ఆ పార్టీ ప్రజల్లో పూర్తిగా విశ్వాసం కోల్పోయిందని వైయస్‌ఆర్‌సీపీ విజయవాడ పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను అన్నారు. మండల పరిధిలోని రామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్‌ నాయకుడు అంగడాల పూర్ణచంద్రరావు,తొర్రగుడిపాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు చెరుకూరి శ్రీరామబ్రహ్మం, కొండూరు గ్రామానికి చెందిన బోడేపూడి నరేంద్ర,లగడపాటి సత్యనారాయణతో పాటు వారి అనుచరులు పార్టీలోకి చేరారు.వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

శ్రీకాకుళం జిల్లాలో:

పొందూరు మండలంలో కేసవదాసు పురంలో 40 కుటుంబాలు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరాయి. స్థానిక నాయకులు మొకర శంకర్రావు సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో వీరంతా పార్టీలోకి చేరారు.

విజయనగరం జిల్లాలో...

వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వం,పార్టీ విధానాలు మెచ్చి ఇతర పార్టీల నుంచి వైయస్‌ఆర్‌సీపీలోకి చేరడం శుభ పరిణామం ఎమ్మెల్సీ,వైయస్‌ఆర్‌సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్‌ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. బీజేపీ రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి  ఎన్‌ఎస్‌ఎస్‌ భాషా,సలీమ్‌ జావేద్‌ సహా వారి అనుచరులు కోటగట్ల సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు.వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంఎస్‌ఎస్‌ భాషా మాట్లాడుతూ అన్ని వర్గాలను కలుపుకొని వెళ్ళే వైయస్‌ జగన్‌ విధానాలు,కోలగట్ల నాయకత్వం నచ్చి పార్టీలోకి చేరినట్లు తెలిపారు. టీడీపీ పాలనలో గిరిజనులకు  తీరని అన్యాయం జరుగుతుందని, వచ్చే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ గెలుస్తుందని, గిరిజనులు అధైర్యపడొద్దని జిల్లేడువలస పంచాయతీ ప్రజలకు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర భరోసా ఇచ్చారు.మండలంలోని జిల్లేడువలస పంచాయతీకి 42 కుటుంబాలు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు.వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

పశ్చిమగోదావరి జిల్లాలో:

చెరుకువాడకు చెందిన ప్రముఖ నాయకుడు మద్దింశెట్టి నాగభూషణం వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు.వైయస్‌ఆర్‌సీపీ ఆచంట నియోజకవర్గ సమన్వయకర్త చెరుకువాడ శ్రీరంగనాథ రాజు తనయుడు నరేష్‌రాజు నాగభూషణానికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

వైయస్‌ఆర్‌ జిల్లాలో..

దువ్వూరు మండల పరిధిలోని ఎర్రబల్లె గ్రామంలో వైయస్‌ఆర్‌సీపీ నాయకులు బూసా వెంకటసుబ్బారెడ్డి, జెడ్పీ కోఆప్షన్‌ మెంబర్‌ మదార్‌వలి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రఘరామిరెడ్డి సమక్షంలో టీడీపీ నుంచి 70 కుటుంబాలు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు.వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 

Back to Top