వంద‌ మంది బాబులు వచ్చినా పేదల ఇళ్లు ఆపలేరు

రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు

 గృహ ప్రవేశాలు జరిపి తీరుతాం... అది తప్పదు

  పేదలు, పెత్తందార్ల పోరాటంలో నిరుపేదలదే గెలుపు

 మంత్రి అంబటి రాంబాబు స్పష్టీకరణ

 పవన్‌.. పాపం పసివాడు:

 తాను పెరగడు. మరెవరినీ ఎదగనివ్వడు.

నిజానికి పవన్‌కళ్యాణ్‌ ఒక మరుగుజ్జు. కూలీ నెంబర్‌.1

  నోట్లో వేలేసుకుని, బాబు చేయి పట్టుకుని తిరుగుతాడు

 మంత్రి  అంబటి రాంబాబు వెల్లడి

 పేద ప్రజలకు రాజధానిలో స్థానం లేదా?
 
వారికిచ్చే ఇళ్ల స్థలాలు సమాధుల కోసమా?

 శుభమా అని ఇంటి స్థలం ఇస్తుంటే అపశకునం మాటలేంటి? బాబూ..?

చంద్రబాబు వ్యాఖ్యలపై ప్రెస్‌మీట్‌లో మంత్రి రాంబాబు ఫైర్‌

సత్తెనపల్లి: వంద‌ మంది బాబులు వచ్చినా పేదల ఇళ్లు ఆపలేరని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఉద్ఘాటించారు. గృహ ప్రవేశాలు జరిపి తీరుతాం... అది తప్పదని స్ప‌ష్టం చేశారు.  పేదలు, పెత్తందార్ల పోరాటంలో నిరుపేదలదే గెలుపు అని మంత్రి పేర్కొన్నారు.  సత్తెనపల్లిలో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు  మీడియాతో మాట్లాడారు.

 ఇళ్లు కట్టిస్తాం.. గృహ ప్రవేశాలు చేయిస్తాం:
– మేం మూడు రాజధానులకు మద్దతు పలుకుతున్నాం. మూడు ప్రాంతాలూ అభివృద్ధి చెందాలనేదే మా సిద్ధాంతం.
– రాజధాని కోసం సేకరించిన భూముల్లో పేదలకు పట్టాలు ఇవ్వడానికి వీల్లేదని దుర్మార్గంగా వ్యవహరించారు. 
– అడ్డుకోవడానికి సర్వశక్తులు ఒడ్డారు. కానీ, చివరికి ఫెయిల్‌ అయ్యారు. 
– రాష్ట్రంలో ప్రతి నిరుపేద కుటుంబానికి మా ప్రభుత్వం ఇల్లు కట్టించి ఇస్తుంది.
– అందుకే 100 మంద్రి చంద్రబాబులు, 1000 మంది పవన్‌లు వచ్చినా ఏమీ చేయలేరు. నిరుపేదలకు ఇళ్లు కట్టించి ఇస్తాం. వారితో గృహ ప్రవేశాలు చేయిస్తాం.
– ఇది పేదలు, పెత్తందార్లకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఇందులో నిరుపేదలదే తుది విజయం.

పేద ప్రజలకు రాజధానిలో స్థానం లేదా?:
– అమరావతిలో 50 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలివ్వాలనుకుంటే దానికి అన్ని రకాలుగా అడ్డపడ్డారు. 
– 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతుల్లో పది మంది రైతులు కోర్టుకు వెళ్లారు. 
– కోర్టుల్లో ఎంతో ఖర్చు పెట్టి పెద్ద ప్లీడర్లను పెట్టుకున్నారు. 
– రైతుల ముసుగు వేసుకున్న వారిలో పరకాయ ప్రవేశం చేసిన చంద్రబాబు, కోర్టుల్లో కేసులు వేయించారు. ఇది వాస్తవం కాకపోతే.. ‘కాదు’ అని చెప్పమనండి.
– సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించడంతో, మరింత కడుపు మండుతున్న చంద్రబాబు, పేదలు తమ ఇంటి స్థలంలో శవాన్ని పాతేసుకోవాలంటూ ఏదేదో మాట్లాడుతున్నాడు. 
– అంటే పేదల ఇళ్ల కోసం ఇచ్చే స్థలాలు సమాధుల కోసమా?
– శుభమా అని ఇళ్ల స్థలాలు ఇస్తుంటే.. ఈ అపశకునం మాటలేమిటి బాబూ?.

పవన్‌.. పాపం పసివాడు:
– పవన్‌కళ్యాణ్‌ పాపం పసివాడు. తాను పెరగడు. మరెవరినీ ఎదగనివ్వడు.
– అలాంటి పవన్‌కళ్యాణ్‌.. జగన్‌ గారిని పాపం పసివాడు అంటున్నారు.
– నిజానికి పవన్‌కళ్యాణ్‌ ఒక మరుగుజ్జు. కూలీ నెంబర్‌.1
– నోట్లో వేలేసుకుని, చంద్రబాబు చేయి పట్టుకుని తిరిగే పాపం పసివాడు పవన్‌ కళ్యాణే.
– 2014లో పార్టీ పెట్టి చంద్రబాబును సపోర్ట్‌ చేశావు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఒక్క అంగుళమైనా పెరిగావా?. ఉన్నకొద్దీ తగ్గిపోతున్నావు.

వారాహిని ఎందుకు దాచావ్‌?:
– ఎవడ్రా మమ్మల్ని ఆపేది అన్నావు. ఎవరూ ఆపలేదు. అయినా వారాహి ఎందుకు బయటకు రావడం లేదు?.
– చంద్రబాబు చెబితేనే పవన్, తన వాహనాన్ని బయటకు తీస్తారు. ప్రచారానికి దిగుతారు.
– డబ్బున్న వారి ఇళ్లలో మహిళలు వడ్డాణాలు చేయించుకుని పండుగకు, పబ్బానికి పెట్టుకుంటారు. 
– అలా బంగారు వస్తువులా వారాహిని దాచుకున్నావు ఎందుకయ్యా..?
– చంద్రబాబు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తేనే వారాహి బయటకు వస్తుంది. ఆయన రెడీ అంటేనే పవన్‌ ప్రచారానికి వస్తాడు.

రాజకీయాల్లో అనర్హుడవు:
– షూటింగ్‌ విరామ సమయంలో వచ్చి, చంద్రబాబు ఇచ్చే స్క్రిప్ట్‌ చదివి వెళ్లిపోయేవాడు పవన్‌కళ్యాణ్‌.
– ఆ మాట అంటే ఆయనకు బాగా పోడుచుకు వస్తోంది. అందుకే  పాపం పసివాడు అంటూ ఏదేదో మాట్లాడుతున్నాడు.
– ఈ దేశంలో రాజకీయాలకు అనర్హుడు ఎవరైనా ఉన్నారంటే.. అది పవన్‌ కళ్యాణే.
– ఎప్పుడో షూటింగ్‌ గ్యాప్‌లో  వచ్చి ఆ మనోహర్‌ను వెంటపెట్టుకుని తిరుగుతాడు.

జన సైనికులను బలి పెడతావా?:
– నీ కోసం మరణించిన అశోక్‌ కుటుంబాన్ని ఆదుకోలేదు. అలాంటి నీవు జనసేనను కాపాడతావా?.
– సత్తెనపల్లి నియోజకవర్గం దూళిపాళ్లకు చెందిన అశోక్‌ అనే యువకుడు 2019లో పవన్‌ కోసం వెళ్లి బైక్‌ యాక్సిడెంట్‌లో చనిపోయాడు. 
– ఆ కుటుంబానికి ఏం న్యాయం చేశావ్‌?. ఆర్థిక సాయం చేస్తానని చెప్పినా, ఆ మాట నిలబెట్టుకోలేదు.
– ఇటీవల పవన్‌ సత్తెనపల్లి వస్తే, తన కొడుకు ఫోటో పట్టుకుని ఆయనను కలవడానికి అశోక్‌ తండ్రి వెళ్లే లాగి అవతల పడేశారు.  
– జనసేన కోసం కాపు సోదరులు, యువకులు గొంతు చించుకుని ప్రాణాలు అర్పించిన వారికి పడుతున్న గతి ఇది. 
– ఇంత కంటే ఘోరం ఏముంటుంది పవన్‌ కళ్యాణ్‌?
– పవన్, నువ్వు చంద్రబాబు చంక ఎక్కాలనుకుంటే.. జన సైనికులను బలి చేస్తావా?.
– తన కోసం మరణించిన అశోక్‌ కుటుంబాన్ని కూడా ఆదుకోలేని పవన్, ఇక జనసేనను ఎలా కాపాడతాడు?.

వైయ‌స్ జగన్‌గారిపై ప్రజల్లో అపార విశ్వాసం:
– అసలు జనసేన పార్టీ పెట్టిందే చంద్రబాబు కోసం. 
– అందుకే కార్యకర్తలు పవన్‌ కళ్యాణ్‌ను నమ్ముకుంటే సరాసరి గంగలో దూకడమే.. గుర్తించండి. 
– రాష్ట్రంలో దళితులు, పేదలూ ఏకమవుతున్నారు. జగన్‌గారు వారి పక్షాన ఉన్నారు. 
– మీరు ఏం చేసినా మేం బెదిరే ప్రశ్న ఉత్పన్నం కాదు. జగన్‌గారి నేతృత్వంలో మా పార్టీ రోజురోజుకూ మరింత బోలపేతం అవుతోంది. 
– సత్తెనపల్లిలోనూ నన్ను ఓడించాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. 
– మాకు వైయ‌స్ జగన్‌ గారి, సత్తెనపల్లి ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. ఇక్కడ మేము అఖండ మెజార్టీతో గెలవబోతున్నాం. 
– చంద్రబాబును, పవన్‌ కళ్యాణ్‌ను నమ్మితే రాష్ట్రం సర్వ నాశనం అవుతుంది. 

ఆ మాట హాస్యాస్పదం:
– నారా లోకేశ్‌ను ఓడించడం ఏముంది? ఆయన ఆల్‌రెడీ ఓడిపోయే ఉన్నాడు.
– సీఆర్‌డీఏలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే.. అది నారా లోకేశ్‌ను ఓడించడానికే అనడం హాస్యాస్పదం. 
– మిమ్మల్ని ఓడించడానికి మేమేం ప్రయత్నం చేయడం లేదు. ఆ అవసరం కూడా మాకు రాదు.

బాబు దళితులకు క్షమాపణ చెప్పాలి:
– ఇచ్చిన హామీ నిలబెట్టుకోని చంద్రబాబు దళితులకు క్షమాపణ చెప్పాలి.
– కంటెపూడికి చెందిన దివ్యాంగురాలు నేలటూరి లక్ష్మికి ట్రైసైకిల్‌తో పాటు, లక్ష రూపాయలు ఇస్తానన్న చంద్రబాబు.
– లావణ్య అనే విద్యార్థినిని చదివించే బాధ్యత తీసుకుంటానన్నాడు.
– కానీ ఇవేవీ చంద్రబాబు తీర్చలేదు. అందుకు ఏవో కారణాలు చెప్పారు.
– నిరుపేదలకు హామీలు ఇవ్వడం, వదిలేయడం చంద్రబాబుకు సహజమైంది.
– అందుకే దళితులకు చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలి.

మమ్మల్ని విమర్శిస్తే డబ్బులిస్తారా?:
– వైయస్సార్‌సీపీని, జగన్‌ గారిని, నన్ను విమర్శిస్తేనే డబ్బులు ఇస్తావా బాబూ?
– సత్తెనపల్లిలో తురకా గంగమ్మ అనే మహిళల నన్ను, నా పార్టీని తిట్టినందుకు పవన్‌కళ్యాణ్‌ రూ.4 లక్షలు, చంద్రబాబు రూ.2 లక్షలు ఇచ్చారు. 
– ఆమెకు మేం కూడా రూ.2.5 లక్షలు ఇచ్చాము. అలా ఆమెకు మొత్తం రూ.8.5 లక్షలు ముట్టాయి.
– అందుకే నేలటూరి లక్ష్మికి ఉదయమే ట్రె ౖ సైకిల్‌ ఇచ్చాం. 
– చంద్రబాబు ఒక దళితద్రోహి. కానీ మేము మాత్రం పార్టీ, వర్గం చూడకుండా సాయం చేస్తున్నాం.

Back to Top