తాడేపల్లి: అది జనసేన పార్టీ కాదు. జోకర్ల సేన పార్టీ అని రాష్ట్ర రహదారులు–భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అభివర్ణించారు.ఆ పార్టీకి ఒక సిద్ధాంతం, రూపురేఖలు లేవని మండిపడ్డారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే.. గుడ్ మార్నింగ్ సీఎం సర్. రోడ్లన్నీ హ్యాట్సాగ్ చేస్తాను అన్నాడు. ఆయన సీఎంగారిపై వ్యాఖ్యలు చేస్తే మేము కూడా ఆయనపై కామెంట్స్ చేయగలం. గుడ్ మార్నింగ్ జనసేన పార్టీ. గుడ్ ఆఫ్టర్‌నూన్ టీడీపీ. గుడ్ ఈవినింగ్ బీజేపీ. అని మేము కూడా మాట్లాడగలం.జనసేన పార్టీ ఒక జోకర్ల సేన పార్టీగా ఉంది. అంతే తప్ప ఆ పార్టీకి ఒక సిద్ధాంతం కానీ, రూపుకానీ లేవు. ఒక ఉదాహరణ. గతంలో ఎన్నడూ లేని విధంగా గోదావరి భారీ వరదలు వచ్చాయి. ఉభయ గోదావరి జిల్లాలు అతలాకుతలం అవుతుంటే, పవన్ వచ్చి రాజకీయం చేస్తున్నాడు. అధికార యంత్రాంగం, పోలీసులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ ఫ్లడ్ మానిటరింగ్, సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటే, పవన్‌కళ్యాణ్ అక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తున్నాడు. అదే ఆయన తాపత్రయం: చంద్రబాబును వీలైనంత త్వరగా సీఎంను చేయాలన్న తాపత్రయం ఆయనలో కనిపిస్తోంది. ఏమైనా అంటే తన పార్టీని ఎక్కడా విలీనం చేయబోనని అంటాడు. ఎవరికీ అమ్ముడుపోను అంటాడు. కానీ చంద్రబాబును సీఎంను చేయాలనే తాపత్రయం తప్ప, వేరే ఉద్దేశం కనిపించడం లేదు. అసలు ఆయనకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడా? ఎంపీ ఉన్నాడా? ఎవరున్నారని ఆయన తన పార్టీని విలీనం చేయబోనని అంటున్నాడు. శరవేగంగా రోడ్ల మరమ్మతులు: గతంలో మాదిరిగా కాకుండా, మేము ఈరోజు రోడ్ల కోసం పెద్ద ఎత్తున వేల కోట్ల నిధులు కేటాయించాం. రోడ్ల మరమ్మతుల కోసం తొలి దశలో సీఎంగారు ఆ నిధులు కేటాయించారు. ఇప్పటికే చాలా చోట్ల శరవేగంగా పనులు జరుగుతున్నాయి. కానీ అవేవీ మీకు కనిపించడం లేదా? ఆనాడు అసలు పట్టించుకోలేదు: పవన్‌కళ్యాణ్‌గారు మీరు గతంలో చంద్రబాబుతో కలిసి ఉన్నప్పుడు, ఇదే మాదిరిగా రోడ్ల మీద హ్యాట్సాగ్ చేసి ఉంటే పరిస్థితి ఇలా ఉండేదా? రోడ్ల నిధులను దారి మళ్లించినా మీరు పట్టించుకోలేదు. చంద్రబాబు రోడ్లు పట్టించుకోకపోయినా మీరు ఏం మాట్లాడలేదు? ప్రతి రోడ్డుకు ఒక జీవితకాలం 8 ఏళ్లు లేదా 10 ఏళ్లు ఉంటుంది. మేము వచ్చి కేవలం 3 ఏళ్లు మాత్రమే అయింది. ఆరోజు రోడ్లు బాగు చేసి ఉంటే ఇవాళ ఆ పరిస్థితి ఉండేది కాదు కదా. మీరు నడిచినా మహానుభావులు కాలేరు: రోడ్ల మీద నడిచిన వారంతా మహానుభావులు కారని అన్నారు. నిజమే ప్రతి అవారా రోడ్ల మీద నడిస్తే మహానుభావుడు అయిపోడు. రోడ్ల మీద నడిచి ప్రజల మనస్సులో స్థానం కల్పించుకుంటే తప్ప, జగన్‌గారి మాదిరిగా మహానుభావులు కారు. అంతేకానీ నీవు, లోకేష్ వంటి వారు రోడ్ల మీద నడిచినంత మాత్రాన మహానుభావులు కాలేరు. క్లారిటీ ఇస్తే బాగుంటుంది: పవన్ నీవు ఇంకోమాట కూడా అన్నావు. వైయస్సార్‌సీపీ నాయకులను చొక్కా పట్టుకుంటే కానీ కిందకు దిగి రారు అన్నావు. మరి గతంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కానీ, అటు విశాఖ జిల్లా గాజువాకలో కానీ ప్రజలు నీ చొక్కా పట్టుకున్నారా? కాలర్ పట్టుకున్నారా? లేక జుట్టు పట్టుకున్నారా? ఒకసారి క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు నీవు, నీ పార్టనర్ చంద్రబాబు చేసిన మోసాలకు సమాధానంగా ప్రజలు నీ చొక్కా, నీ జుట్టు పట్టుకోవడంతో నీకు ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి వచ్చింది. జోకర్ మాటలు. జోకర్ కబుర్లు. పని లేని మాటలు మాట్లాడుతున్నావు. ఈరోజు ఎలా ఉందంటే పని లేని పవన్‌కళ్యాణ్ పిచ్చి స్టేట్‌మెంట్లు ఇస్తున్నాడు. ‘వారాంతం’ రాజకీయాలు: వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే, వారిని పరామర్శించాల్సింది పోయి, రాజకీయాలు చేస్తున్నాడు. పవన్ రాజకీయం ఎలా ఉందంటే.. సోమవారం నుంచి శుక్రవారం వరకు బాబు, ఆయన కొడుకు (చంద్రబాబు, లోకేష్) రాజకీయం చేస్తారు. ఆ తర్వాత రెండు రోజులు.. శని, ఆదివారాలు పవన్ తీసుకున్నాడు. వ్యూహాత్మకంగా ఆ రెండు రోజులు బాబు, ఆయన కొడుకు బయట కనబడరు. ఎందుకంటే శని, ఆదివారాలు నీవు వారికి కాల్‌షీట్ ఇచ్చావు కాబట్టి. అందుకే నీవు బయటకు వస్తున్నావు. వారి డైరెక్షన్ మేరకు లేదా ఏబీఎన్ డైరెక్షన్ మేరకు నీవు నోటికొచ్చినట్లు, తింగరి మాటలు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. కామపిశాచికి ఆ ఫీలింగ్స్ ఉండవు: ఒకటి మాత్రం నిజం. జగన్‌గారు పాదయాత్ర చేసినప్పుడు పసిపిల్లలు, వృద్ధులను ప్రేమ, అభిమానంతో నిమిరారు. వారిని పలకరించారు. ఆ విధంగా ఆయన వారికి ఒక భరోసా కల్పించారు. నీ వంటి కామపిశాచికి అలాంటి ఫీలింగ్స్, మంచి ఆలోచనలు ఎలా తెలుస్తాయి. నీ ఆలోచనలన్నీ కామంతో కూడుకుని ఉంటాయి. రాష్ట్రంలో ఉన్న తల్లిదండ్రులు తమ ఆడపిల్లలు నీ కంట కనబడకుండా జాగ్రత్త పడుతున్నారు. మరోవైపు నీవేమో నీతులు చెబుతున్నావు. నీవి కుల, మత రాజకీయాలు: ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాను. మా సీఎంగారికి రోజంతా ప్రజల సంక్షేమం, అభివృద్ధి తప్ప మరో ఆలోచన ఉండదు. ఇంకా చెప్పాలంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల గురించి ఆయన ఎక్కువగా ఆలోచిస్తాడు. అదే సమయంలో నీ మాదిరిగా కులాలు, మతాల గురించి మాట్లాడిన వ్యక్తి ఈ ప్రపంచంలోనే ఎవరూ ఉండరు. మళ్లీ కులాలు, మతాలు లేని రాజకీయం చేస్తానంటావు. నిజానికి ఇవాళ రాష్ట్రంలో కుల, మతాలకు అతీతంగా రాజకీయాలు కొనసాగుతున్నాయి. కులం, మతాలకు అతీతంగా అన్ని సంక్షేమ పథకాలు, పూర్తి శాచురేషన్ పద్ధతిలో అందుతున్నాయి. దాదాపు రూ.1.65 లక్షల కోట్లు పేద ప్రజలకు అందాయి. కానీ అవేవీ నీకు, నీ పార్టనర్ చంద్రబాబుకు కనిపించవు. ఆనాడు ఏమన్నావు. నిన్న ఏమన్నావు?: నిన్న ఏం మాట్లాడావో ఒకసారి చూసుకో. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని సమర్థించానని చెప్పావు. కానీ నిజానికి ఆరోజు ప్రభుత్వం ఈ నిర్ణయం ప్రకటించగానే ఏమన్నావు. ఆ జిల్లాకు మాత్రమే అంబేడ్కర్ పేరు పెట్టాలా? అంబేడ్కర్‌ను కేవలం ఒక జిల్లాకు మాత్రమే పరిమితం చేస్తారా అన్నావు. అవన్నీ మర్చిపోయి, నిన్న ఏమన్నావు. ఆ నిర్ణయాన్ని తొలుత స్వాగతించింది నేనే అన్నావు. అసలు నీవు ఎప్పుడు, ఏం మాట్లాడుతున్నావో ఎవరికీ అర్థం కావడం లేదు. మళ్లీ ఓటమి తప్పదు: 2024లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లేని ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నట్లు చెప్పావు. అయితే ఒకటి నిజం. ఆ ఎన్నికల్లో నిన్ను, నీకు ప్యాకేజీ ఇస్తున్న నాయకుణ్ని ప్రజలు మరోసారి తరిమి కొడతారు. మీకు మళ్లీ ఓటమి తప్పదు. ఇది నిజం. ధైర్యంగా ప్రజల వద్దకు: మేము ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేశాం. అందుకే ఇంటింటికీ ధైర్యంగా వెళ్తున్నాం. మీకు పథకాలు అందితే ఆదరించమని కోరుతున్నాం. అంతే తప్ప, చంద్రబాబు మాదిరిగా ఎన్నికలు పూర్తి కాగానే మేనిఫెస్టోను కనిపించకుండా చేయలేదు. ప్రజలకు అన్నీ తెలుసు: కులం, మతం గురించి గతంలో చంద్రబాబు మాట్లాడేవాడు. ఇప్పుడు పవన్ మాట్లాడుతున్నాడు. రాష్ట్రంలో పవన్ రాజకీయాలు ప్రతి ఒక్కరికి తెలుసు. ముఖ్యంగా కాపులకు అన్నీ తెలుసు. తమకు ఎవరు మేలు చేస్తున్నారన్న దానిపై వారికి స్పష్టత ఉంది. ఓర్చుకోలేకే విమర్శలు: శాచురేషన్ పద్ధతిలో పేదలకు, ప్రజలకు డీబీటీ విధానంలో రూ.1.65 లక్షల కోట్లు జమ కావడాన్ని పవన్ ఓర్చుకోలేక పోతున్నాడు. అదే విధంగా పేద పిల్లలు బాగా చదువుకోవడం ఆయనకు ఇష్టం లేదు.