కేంద్ర‌మంత్రితో మంత్రి శంక‌ర్‌నారాయ‌ణ భేటీ

రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాల‌పై చ‌ర్చ‌

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ సమావేశమయ్యారు. ఢిల్లీలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్‌సభ పక్ష నేత మిథున్‌రెడ్డి, ఎంపీ మార్గాని భరత్‌తో కలిసి గడ్కరీని కలిశారు. అనంతరం మంత్రి శంకరనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ తూర్పు బైపాస్, విశాఖ–భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఆరు లేన్ల రహదారి, కడప–రేణిగుంట రహదారి నిర్మాణాలకు అవసరమైన నిధుల గురించి గడ్కరీకి విజ్ఞప్తి చేశామని తెలిపారు. అనంతపురం, చిత్తూరుతోపాటు ఇతర జిల్లాల్లోని ముఖ్యమైన అంతర్రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలని కోరామన్నారు. తాము కోరిన అన్నింటికీ కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు.    

తాజా వీడియోలు

Back to Top