జయహో బీసీ మహాసభపై ఎందుకంత ఉలికిపాటు?

 వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు యనమల నాగార్జునయాదవ్, కొండా రాజీవ్‌గాంధీ  

బీసీల సంక్షేమంపై టీడీపీ నేతల పచ్చి అబద్ధాలు

ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు

 నిజాలు కళ్లకు కనిపిస్తున్నా.. కళ్లార్పకుండా టీడీపీ అసత్యాలు

గణాంకాలతో సహా తేటతెల్లం..

 నాగార్జున యాదవ్

 బీసీలను బానిసలుగా చూసిన బాబు..

 బీసీలకు రక్షగా జగనన్న

 టీడీపీలో బీసీలను జెండా మోసేవారిగానే చూశారు

 అదే వైయ‌స్ఆర్‌సీపీలో బీసీలే ఎజెండా రూపకర్తలు

 బీసీల రిజర్వేషన్లు అడ్డుకుంది మీరు కాదా బాబూ..?

 బీసీలు జడ్జీలుగా పనికిరారని లేఖ రాసింది నిజమా? కాదా?

 కాదని, నీ కొడుకు లోకేష్ మీద ప్రమాణం చేయగలవా?

 కొండా రాజీవ్ గాంధీ 

తాడేపల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున జయహో బీసీ మహాసభ ఏర్పాటు చేస్తుంటే టీడీపీ నేత‌ల‌కు ఎందుకంత ఉలికిపాటు అని  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు యనమల నాగార్జునయాదవ్, కొండా రాజీవ్‌గాంధీ ప్ర‌శ్నించారు. బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ కంటే 23.46 శాతం ఎక్కువ కేటాయించి, 17.3 శాతం ఎక్కువ ఖర్చు చేసిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ప్రభుత్వం అని టీడీపీ కరపత్రం అయిన ఈనాడులోనే రాశారు. వాస్తవాలు ఇలా ఉంటే, తెలుగుదేశం పార్టీ నేతల మాటలు వింటుంటే ఆశ్చర్యం కలుగుతోందన్నారు. మంగ‌ళ‌వారం వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో నాగార్జున యాద‌వ్‌, కొండా రాజీవ్ గాంధీ మీడియాతో మాట్లాడారు.

 నాగార్జన యాదవ్‌ ఏం మాట్లాడారంటే..: 
    ఇవాళ కూడా అచ్చెన్న, అయ్యన్న అనే ఇద్దరు లంచగొండి కవలలు మీడియా ముందుకు వచ్చి, ఏదేదో మాట్లాడారు. వారికి కొంచెం జ్ఞానం ప్రసాదించాలని కోరుకుంటున్నాం. 
    1995లో చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీని ఆక్రమించుకున్న తర్వాత ప్రతి సాధారణ ఎన్నికల్లో బీసీలకు 100 టికెట్లు ఇస్తామని చెప్పి, ఆ మాట ఎందుకు నిలబెట్టుకోలేదు? మరి దాన్ని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? 2014 ఎన్నికలకు ముందు బీసీలకు 100 టికెట్లు ఇస్తామని చంద్రబాబు చెప్పారు. దానికి సంబంధించిన ఈనాడు క్లిప్‌ ఇది. మరి, ఇవ్వకుండా బడుగు, బలహీన వర్గాలకు ఎందుకు వెన్నుపోటు పొడిచారు?

రిజర్వేషన్లనూ అడ్డుకున్నది మీరు కాదా?:
    మరో ఆశ్చర్యకరమైన విషయం అయ్యన్నపాత్రుడు మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు తాము 34 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలనుకుంటే, సీఎంగారు కేవలం 24 శాతం మాత్రమే ఇచ్చారని అసత్యం చెప్పారు. నిజానికి స్థానిక ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాలకు 34 శాతం రిజర్వేషన్‌ కోసం ముఖ్యమంత్రి జగన్‌గారు 2019, డిసెంబరు 29న జీఓ నెం:176 జారీ చేస్తే, కర్నూలుకు చెందిన బిర్రు ప్రతాప్‌రెడ్డి అనే వ్యక్తి కోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చారు. ఆయన ఎవరు అంటే.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆయన ఏపీ ఎన్‌ఆర్‌ఈజీఎస్‌కు డైరెక్టర్‌(అప్పటి ప్రభుత్వం 2016, జనవరి 1న జారీ చేసిన జీఓ ఎం ఎస్‌ నెం:1 జారీ చేసింది). అంటే బడుగు, బలహీన వర్గాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు కాకుండా అడ్డుకున్నది తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి. ఇది వాస్తవం కాదా?. బీసీలు రాజకీయంగా ఎదుగుతారన్న కుట్రతో కోర్టుకు పోయి అడ్డుకుంది చంద్రబాబునాయుడు చంచాలు కాదా? 

బీసీలకు వైయ‌స్‌ జగన్‌గారు మేలు:
    కోర్టు ఆదేశం ఎలా ఉన్నా ప్రజాస్వామ్య బద్ధంగా బడుగు, బలహీన వర్గాలకు మేలు చేయడం కోసం ఆయన పార్టీ తరపున రిజర్వేషన్లు అమలు చేశారు. ఈరోజు జడ్పీ ఛైర్మన్లలో 70 శాతం బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీలున్నారు. మండల పరిషత్‌లో వారు 67 శాతం, కార్పొరేషన్ల మేయర్‌ పదవుల్లో 92 శాతం, మున్సిపాలిటీలలో 73 శాతం బడుగు బలహీన వర్గాల వారున్నారు. అదే విధంగా 137 జనరల్‌ కార్పొరేషన్లలో 39 శాతం ఛైర్మన్లు బడుగు బలహీన వర్గాల వారుండగా, డైరెక్టర్లలో 59 శాతం బీసీలు ఉన్నారు. అంతే కాకుండా ఓసీలకు కేటాయించిన పదవిలో కూడా బీసీలకు సీఎంగారు ప్రాధాన్యం ఇచ్చారు. కృష్ణా జిల్లా జడ్పీ ఛైర్మన్‌ పదవి ఓసీకి కేటాయిస్తే, గౌడ సామాజికవర్గానికి చెందిన ఉప్పల హారిక అనే బీసీ సామాజికవర్గానికి చెందిన మహిళకు ఆ పదవి ఇచ్చారు. ఇది వైయ‌స్ జగన్‌గారి ఘనత.

బీసీల సంక్షేమంపై వ్యయం-వాస్తవాలు:
    ఇంకా బీసీల నిధులు, నియామకాల్లో కూడా సీఎంగారు అన్యాయం చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. తాము అమలు చేసిన ఆదరణ పథకం రద్దు చే«శారని విమర్శించారు.
    కానీ వాస్తవం ఏమిటంటే.. సామాజిక సాధికారత (సోషల్‌ ఎంపవర్‌మెంట్‌)పై తెలుగుదేశం పార్టీ ఇచ్చిన శ్వేతపత్రంలోనే ఉంది. దాంట్లో చంద్రబాబు ఏం చెప్పారంటే.. ఆదరణ పథకంలో 5 ఏళ్లలో బీసీలకు రూ.964 కోట్లు ఇచ్చామని వెల్లడించారు. 2018, డిసెంబరులో ఈ విషయాన్ని ప్రకటించారు.
    అదే సీఎం శ్రీ వైయస్‌ జగన్, 5 చట్టాలు, 56 కార్పొరేషన్లు, 9 నవరత్నాలు, 18 ప్రత్యేక పథకాలు, 14 శాఖల పథకాల ద్వారా బడుగు, బలహీన వర్గాలు, బీసీలకు డీబీటీ, నాన్‌ డీబీటీ విధానంలో ఏకంగా రూ.90,415 కోట్లు అందజేశారు. అంటే 5 ఏళ్లలో కేవలం రూ.964 కోట్లు రుణాల రూపంలో ఇచ్చిన తెలుగుదేశం పార్టీ గొప్పా?. మూడున్నర ఏళ్లలో వివిధ పథకాల ద్వారా ఏకంగా రూ.90,415 కోట్లు ఇవ్వడం గొప్పా?.. అన్న విషయాన్ని అందరూ గమనించాలని కోరుతున్నాం. 
    దాంతోపాటు, టీడీపీ నాయకులు మరో మాట అన్నారు. సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ తక్కువ సంఖ్యలో బీసీలకు సహాయం చేశారని ఆరోపించారు. కానీ ఇక్కడ కూడా వాస్తవాలు చూస్తే..
    తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన శ్వేతపత్రంలో 35వ పేజీ చూస్తే.. బీసీలకు ఏటా రూ.10 వేల కోట్ల చొప్పున, 5 ఏళ్లలో మొత్తం రూ.50 వేల కోట్లు ఇప్తామని చెప్పి, బడ్జెట్లో రూ.22,615 కోట్లు ప్రతిపాదించి ఖర్చు చేసింది కేవలం రూ.14,246 కోట్లు మాత్రమే. ఈ లెక్కలు వారు ఇచ్చినవే.
అదే జగన్‌గారు, సీఎం అయిన తొలి ఏడాదిలోనే బడుగు, బలహీన వర్గాలకు రూ.15 వేల కోట్లు కేటాయించి, ఖర్చు చేశారని ఈనాడులో ఆ ఏడాది జూలై 13న రాశారు. బీసీల సంక్షేమానికి జగన్‌గారి ప్రభుత్వం ఎక్కువ కేటాయించి, ఖర్చు చేస్తోందని రాశారు.
    బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ కంటే 23.46 శాతం ఎక్కువ కేటాయించి, 17.3 శాతం ఎక్కువ ఖర్చు చేసిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ప్రభుత్వం అని టీడీపీ కరపత్రం అయిన ఈనాడులోనే రాశారు. వాస్తవాలు ఇలా ఉంటే, తెలుగుదేశం పార్టీ నేతల మాటలు వింటుంటే ఆశ్చర్యం కలుగుతోంది.

రుణాలు ఇప్పుడే ఎక్కువ:
    టీడీపీ నాయకులు మరో విమర్శ చేశారు. బడుగు, బలహీనవర్గాలు, బీసీలకు జగన్‌గారు తక్కువ రుణాలు వచ్చేలా చూశారని ఆరోపించారు. అయితే వాస్తవాలు చూస్తే..
    బీసీలు, బడుగు బలహీనవర్గాలకు కచ్చితంగా రుణాలు మంజూరు చేయాలని ఎస్ఎల్బీసీ బ్యాంకర్ల సమావేశాల్లో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌  విజ్ఞప్తి చేశారు. బడుగు, బలహీనవర్గాలు, ఎస్సీలకు 11 శాతం రుణాలు ఇవ్వాలని దేశంలో మార్గదర్శకాలు ఉంటే, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం సాధించని విధంగా ఏటా 24.61 శాతం రుణాలు వచ్చేలా చూశారు. ఆ విధంగా 2021 - 22లో బ్యాంకుల ద్వారా బీసీలు, బలహీనవర్గాలకు ఏకంగా రూ.1,26,528 కోట్ల రుణాలు ఇప్పించారు

జనగణన లేఖ:
    టీడీపీ నేతలు మరో పచ్చి అబద్ధం చెప్పారు. బీసీ జనగణన చేయడం లేదని. ఆ మేరకు ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయలేదని అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.
    కానీ నిజానికి 2021, అక్టోబరు 28న శాసనసభలో తీర్మానం చేసి, బీసీ జనగణన చేయాలని కేంద్రానికి లేఖ పంపింది. వాస్తవాలు ఇలా ఉంటే, తెలుగుదేశం పార్టీ నేతలు అసత్యాలు చెబుతూ, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఎక్కడా వ్యక్తిగత విమర్శలు చేయడం లేదు. విష ప్రచారం చేయడం లేదు. స్పష్టమైన గణాంకాలు ప్రజల ముందు ఉంచుతున్నాం. తెలుగుదేశం పార్టీలో జెండాలు మోసే కూలీలుగా బీసీలను చూస్తే, పార్టీ ఎజెండా రూపొందించే వారిగా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చూస్తోంది.

రేపు సునామీలా జయహో బీసీ మహా సభః కొండా రాజీవ్ గాంధీ
    రేపు విజయవాడ నడిబొడ్డున జయహో బీసీ మహాసభ జరుగుతోంది. దానికి లక్షలాది బీసీ సోదరులు తరలి వస్తున్నారు. ఈ రాజకీయ సంగ్రామంలో బీసీ సోదరులంతా సునామీలా వస్తుంటే, దాంట్లో చంద్రబాబు కొట్టుకుపోతారు. దీంతో తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు బీసీ జాగిలాలను మా మీద దాడికి వదిలారు. వారు ఎవరా అని చూస్తే..
    ఒక గంజాయి డాన్, స్మగ్లర్‌ అయ్యన్నపాత్రుడు. ఈఎస్‌ఐలో మందులు మెక్కిన అచ్చెన్నాయుడు, కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ల ద్వారా మహిళాజాతిని సర్వ నాశనం చేసిన బుద్ధి లేని బుద్ధా వెంకన్న మాట్లాడుతున్నారు. బీసీల కోసం ఎంతో చేస్తున్న జగన్‌గారి ప్రభుత్వంపై కారుకూతలు కూస్తున్నారు. 

అన్నం తింటున్నారా?:
    మీకు నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ది ఉంటే, చంద్రబాబునాయుడు ఆరోజు మత్స్యకారులు, నాయీ బ్రాహ్మణుల తోక కట్‌ చేస్తానన్నప్పుడు మీరు ఎక్కడున్నారు? మీరు అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా? ఆరోజు ఎందుకు స్పందించలేదు? చంద్రబాబును ప్రశ్నించలేదు?

అదేనా స్వేచ్ఛ అంటే?:
    ఏమన్నా అంటే పవర్‌లేని పదవులు అంటారు. స్వేచ్ఛ లేదంటారు. అధికారం ఇవ్వలేదు బీసీలకు అంటారు. అంటే చంద్రబాబు దగ్గర పదవులు పొందిన మీరు, అక్రమాలు చేయడం, బీసీలకు అన్యాయం జరుగుతుంటే కళ్ళప్పగించి చూడటమేనా. ఇదేనా మీకు తెలిసిన స్వేచ్ఛ. అధికారం?
    చంద్రబాబు వంటి ఒక దుర్మార్గుడు సీఎంగా ఉన్నప్పుడు కీచక రాజ్యాంగం అమలు చేశాడు. ప్రపంచ కీచక సంఘానికి చంద్రబాబు అధ్యక్షుడు అయితే, రాష్ట్ర అధ్యక్షుడుగా అచ్చెన్నాయుడు, కోశాధికారిగా అయ్యన్నపాత్రుడు, సలహాదారుడిగా బుద్ధా వెంకన్న వ్యవహరించారు. 

బీసీలకు ఉన్నత పదవులు:
    ఇవాళ జగన్‌గారి ప్రభుత్వం అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. మీ కళ్లకు కనిపించడం లేదా? విజయవాడ నగర మేయర్‌ పదవిలో గతంలో ఎప్పుడూ కమ్మ లేదా కాపులే ఉన్నారు. కానీ తొలిసారిగా బడుగు, బలహీనవర్గానికి చెందిన ఒక మహిళకు ఇచ్చారు. మీనోరు ఎందుకు పడిపోయింది? ఎందుకు మాట్లాడడం లేదు?.
    అలాగే విశాఖ నగరంలో మేయర్‌ పదవి జనరల్‌కు కేటాయిస్తే, దాంట్లో బీసీ మహిళ, యాదవ సామాజిక వర్గానికి చెందిన, బాగా చదువుకున్న లెక్చరర్‌ కె.హరివెంకటకుమారికి ఇస్తే, బీసీకి పదవి ఇచ్చినట్లు కాదా? నగరంలో మేయర్‌ కంటే ఇంకా ఎక్కువ పదవి ఏమైనా ఉంటుందా?

ప్రమాణం చేయగలరా?:
    చంద్రబాబును ఒకటే అడుగుతున్నాను. బీసీలు జడ్జీలుగా ఉండడానికి అర్హులు కారని లేఖ రాసింది నిజమా? కాదా? నీ కొడుకు మీద ప్రమాణం చేయగలవా?
    స్థానిక ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ రిజర్వేషన్లు అమలు కాకుండా నీ మనిషి ద్వారా సుప్రీంకోర్టులో కేసు వేయించింది వాస్తవమా? కాదా? నీ మనవడి మీద ప్రమాణం చేయగలవా?
    అలాంటి నీవు బీసీల గురించి మాట్లాడొచ్చా? నీకా అర్హత ఉందా?
బీసీల రిజర్వేషన్ల కోసం రాజ్యసభలో ప్రైవేటు బిల్లు పెట్టిన విజయసాయిరెడ్డిగారు, బీసీల గురించి మాట్లాడితే తప్పు పడతావా?. అదే, బీసీలకు ద్రోహం చేసిన చంద్రబాబు.. బీసీల గురించి మాట్లాడవచ్చా?

బీసీలు ఆనాడే ఏకమయ్యారు:
    చంద్రబాబు, బీసీలను ఆర్థిక దోపిడి చేశాడు. బీసీ నిధుల్లోనూ అక్రమాలకు పాల్పడ్డాడు. తన రాజకీయ జీవితం అంతా బీసీలను బానిసలుగా చేసుకుని బ్రతికాడు చంద్రబాబు. కానీ ఇవాళ బీసీలకు ఒక బలం ఉంది. ఆయనే జగన్‌గారు. బీసీలకు రక్షగా జగన్ గారు ఉన్నారు. బీసీలంటే జగన్ గారి దృష్టిలో సమాజానికి బ్యాక్ బోన్. 
-  బీసీలంతా ఏకం కావాలని అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు అంటున్నారు. 
    అచ్చెన్నాయుడుకు ఒంట్లో బరువు ఎక్కువైంది. అయ్యన్నపాత్రుడికి మెదడులో కొవ్వు ఎక్కువైంది. నిజానికి 2019లోనే బీసీలంతా ఏకమయ్యారు. అందుకే జగన్‌గారు సీఎం అయ్యారు. చంద్రబాబు ఇంట్లో కూర్చున్నారు.

Back to Top