విద్యపై ప్ర‌భుత్వం చేస్తున్న ఖర్చు రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడి

విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

విజ‌య‌వాడ‌: విద్యపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చు రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడి అని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విద్యా శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహిస్తు­న్న రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్‌–2022ను మంత్రి బొత్స‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థుల్లోని నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహించాలని తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను కోరారు. చదువు మాత్రమే కాకుండా కళలు, క్రీడలవైపు కూడా తగిన ప్రోత్సాహం అందించాలని సూచించారు. విద్యా రంగంలో ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథ­కాల విజయవంతానికి ఉపాధ్యాయులు అంకితభావంతో కృషి చేయాలన్నారు. అనంతరం పలు కళారూపాలను ప్రదర్శించిన చి­న్నా­­రులను మంత్రి బొత్స సత్యనారాయణ అభినందించారు.

Back to Top