విశాఖ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పవర్‌స్టార్ కాదు..ప్యాకేజీ స్టార్ అని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. రెండు రోజులుగా పొలిటికల్ టూరిస్ట్ ఏపీకి విచ్చేసి వారి పార్టీ విధానాన్ని చెప్పాడు. 2024 ఎన్నికల్లో ఆయన ఆలోచనల్ని చాలా వివరంగా చెప్పారు. ఇక రాజకీయంగా నావల్ల కాదు..నేను పార్టీని నడపలేనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశాడని తెలిపారు. విశాఖలో మంత్రి మీడియాతో మాట్లాడారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏమన్నారంటే.. - ఒంటరిగా పోటీ చేయలేను..నాకు ఎవరి తోడో కావాలని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. - నాకు తెలిసిన ఇప్పుడున్న 26 జిల్లాలకే అధ్యక్షులు లేరు..కనీసం ఉమ్మడి జిల్లాలైన 13 జిల్లాలకీ అధ్యక్షులు లేరు - జిల్లా అధ్యక్షులే లేనప్పుడు ఈ మండలాధ్యక్షులు ఎక్కడి నుంచి వచ్చారు..? - నా విధానం ఇది...దీన్ని మీరందరూ అంగీకరించాలని చెప్పేందుకు ఈ రోజు సమావేశం పెట్టినట్లుంది. - మేం దాదాపు ఏడాది క్రితం నుంచి ఈయన పవర్‌స్టార్ కాదు..ప్యాకేజీ స్టార్ అని చెప్తూనే ఉన్నాం. - ఈయన పార్టీ పెట్టిందే చంద్రబాబు కోసం అని మొదటి నుంచీ చెప్తూనే ఉన్నాం. - మేం ఆ వాస్తవాన్ని చెప్తే ఓ రోజు కాలు చూపించాడు..మరో సారి చెప్పు చూపించాడు. ఇప్పుడేం చూపిస్తాడు..? - ఇప్పుడు ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు చెప్పులు చూపించాలి. - రాజకీయంగా పూర్తిగా సిగ్గు శరం వదిలేసి బట్టలొదిలేశాడు. - ఎవరేమనుకున్నా పర్లేదు...నేను చంద్రబాబుకు అమ్ముడుపోతాను అని తేటతెల్లం చేశాడు. - ఇంకా ఎవరికైనా అపోహలేమైనా ఉన్నాయో ఏమోనని నిన్నా, ఇవాళ నివృతి చేశాడు. మళ్లీ చిత్తుచిత్తుగా ఓడితే వచ్చే జనం కూడా రారనే భయంతో బాబు చెంతకి: - 140 స్థానాల్లో 2019లో పోటీ చేస్తే సుమారు 120 స్థానాల్లో డిపాజిట్లు కూడా రాలేదు. - లింగులింగుమంటూ ఒకచోట గెలిచాడు..తాను పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయాడు. - అప్పట్లో ఆయన ఓటింగ్ పర్సంటేజ్ 6.9 శాతం మాత్రమే వచ్చింది. - రేపు ఒంటరిగా పోటీ చేస్తే తన బలం ఏంటో తెలిసిపోతుంది..మళ్లీ చిత్తుచిత్తుగా ఓడితే వచ్చే జనం కూడా రాకుండా పోతారనే భయంతో ఉన్నాడు. - అందుకే చంద్రబాబు ఓటమిలో తన ఓటమిని కూడా కలిపేస్తే చంద్రబాబు వల్ల ఓడిపోయామని చెప్పుకోవచ్చని భావించాడు. - ఓ పక్క సాకును వెతుకున్నాడు...çమరో పక్క సంచి సర్దేశాడు... - చంద్రబాబు ఎంత ఇచ్చాడనేది పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. - సినిమాలో నటిస్తే మీకు ఎంతిస్తారో చెప్పావు కదా...అలానే చంద్రబాబు ఎంతిచ్చాడో కూడా చెప్పాలి. - నేను దైవాంశ సంభూతుడిని, దేవుడ్ని అని ఆవిర్భావ సభలో చెప్పాడు - ఆ దేవుడ్ని నమ్ముకున్న భక్తులందరికీ పంగనామాలు పెట్టాడు. - అది జనసేన కాదు..వేరే వారి జెండాలు మోసే సేనగా మారిపోయింది. - 2019లో సీపీఐ, సీపీఎం, బీఎస్పీ జెండా మోశాడు. - 2014లో బీజేపీ, టీడీపీ జెండా మోశాడు. 2019 నుంచి మళ్లీ బీజేపీ జెండా మోస్తున్నాడు. - ఇప్పుడు తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి ఉంటే బాగుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మళ్లీ జెండా కూలిపని చేయడానికి సిద్ధపడిపోయాడు. - మేం జనసైనికులు అని చెప్పుకున్న వారు ఇప్పుడు సైనికులు కాదు..జెండా కూలీలుగా మారాల్సిన పరిస్థితి వచ్చింది. - ఆయన ఎవరి జెండా పట్టుకోమంటే ఆ జెండా పట్టుకోవడమే వారి పని. - సీఎం కావాలని పవన్ కళ్యాణ్ లేని కోరిక మీకెందుకు..? కాపులందర్నీ తీసుకెళ్లి తాకట్టు పెట్టడానికా..?: - కనీసం కులాభిమానం అన్నా ఉండాలి కదా అని మాట్లాడతున్నాడు. - కాపులందర్నీ తీసుకెళ్లి చంద్రబాబుకు తాకట్టుపెట్టడానికా..? - ఒక పార్టీ పెట్టామంటే ప్రజల కోరికలను అధికారంలోకి వచ్చి వాటిని తీర్చడానికి. - కానీ ఈయన పార్టీ పెట్టింది మాత్రం జగన్ గారిని గద్దెదించడానికే అనడానికి సిగ్గులేదా..? - 2011లో జగన్ గారు పార్టీ పెట్టినప్పుడు రెండు బలమైన పార్టీలు రాష్ట్రంలో లేవా..? - అప్పుడు దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఉంది. బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు కూడా ఉన్నాయి. - ఆ పరిస్థితుల్లో జగన్ గారు పార్టీని స్థాపించి 8 ఏళ్లలో 151 సీట్లతో, 51 ఓట్ల శాతంలో పార్టీ అధికారంలోకి తెచ్చిన నాయకుడు జగన్ గారు. - అసలు జగన్‌గారితో నీకు పోలికేంటి..? ఏం తప్పు చేశాడని జగన్‌గారిని ఓడించాలి..? నాలుగు కారణాలు చెప్పాలి. - చంద్రబాబు రాష్ట్రాన్ని నానా దరిద్రంగా తయారుచేస్తే అన్నీ మూసుకు కూర్చున్న ఈ వ్యక్తి ఇప్పుడొచ్చి జగన్‌గారిని ఓడిస్తాడట. - మీకు ఒంటరిగా ఎంత ఓట్ల శాతం ఉందో తెలియాలంటే నువ్వు ముందు 175 స్థానాల్లో పోటీ చేయాలి కదా. - ఎంఐఎంకి 7 సీట్లు, విజయకాంత్‌కు 18 సీట్లు ఇచ్చారు అంటాడు..నువ్వేం చేశావని నీకు అన్ని సీట్లు ఇస్తారు..? - ఒక రాజకీయ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడం అంటే మూడు పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కనేయడమా..? - మాకంటే ఘోరంగా మీ పార్టీ నేతలే నీ గురించి మాట్లాడుకుంటున్నారు.. - మా భవిష్యత్తేమిటో మాకు తెలియడం లేదు అంటున్నారు..ఈరోజైనా వాళ్లు కళ్లుతెరుస్తారేమో..? ముప్పై సీట్లు ఇస్తే ఎలా ముఖ్యమంత్రి అవుతాడో..?: - మొన్న చంద్రబాబు ఇంటికి పెళ్లి చూపులకు వెళ్లినప్పుటి నుంచీ ఇదంతా ప్రారంభం అయ్యింది. - ఆ రోజు ఏం మాట్లాడుకున్నాడో దాన్నంతా ఈ రోజు పార్టీ నాయకుల ముందు పెట్టి ర్యాటిఫికేషన్ అడుగుతున్నాడు. - నాకు బలం లేదని చెప్తున్నాడు. 30 సీట్లు ఇస్తే నువ్వు ముఖ్యమంత్రి అయిపోతావా..? - వాళ్ల వీళ్ల చంకనెక్కితే ముఖ్యమంత్రి అయిపోతావా..? - మళ్లీ బలం లేనప్పుడు మనం ముఖ్యమంత్రి ఎలా అడుగుతాం అంటాడు. అసలు అతనికే ఒక క్లారిటీ లేదు. - ఒక విధానం, సిద్ధాంతం లేదు..నీకెందుకు పార్టీ. - చక్కగా సినిమాలు చేసుకుంటే బాగుంటుంది కదా..ఆ విలాసవంతమైన జీవితమే బాగుంది కదా - ఇక్కడకు వచ్చి ప్రజల్ని, నమ్ముకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలను మోసం చేస్తున్నావు - వీరందరినీ కట్టకట్టి టీడీపీ జెండాలు మోయించడానికా..? - 2019 నుంచే సీరియస్ రాజకీయాలు చేస్తున్నాను అంటే యువరాజ్యంలో ఉన్నప్పుడు నువ్వు చేసింది రాజకీయం కాదా..? - 2014 నుంచి 2019 వరకూ చేసింది రాజకీయం కాదా.? - ప్యాకేజీలు తీసుకుని చంద్రబాబు కోసం పనిచేసినప్పుడు రాజకీయం కాదా..? - జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యే సరికి నీకు రాజకీయం గుర్తుకువచ్చింది...సమస్యలు గుర్తుకు వచ్చాయా..? - ముందు ఇంట్లో ఉన్న సమస్యలు తీర్చుకో...తర్వాత ప్రజల సమస్యలు తీర్చుదువు గానీ. లోకేశ్ పాదయాత్రతో వారాహికి బ్రేక్: - జగన్ గారు పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమం అందిస్తుంటే ఏదో ఒక సందర్భంలో వచ్చి విమర్శించి వెళ్తాడు. - ఇంతకీ ఆ వారాహి ఎక్కడికెళ్లింది..? లోకేశ్ పాదయాత్ర మొదలు పెట్టాడు ఆ వారాహి షెడ్‌కు వెళ్లింది. - నన్ను చూడ్డానికి వస్తున్నారు కానీ ఓట్లు వేయడం లేదని నువ్వే చెప్తున్నావు కదా..ఎందుకు ఇక నీకు రాజకీయాలు. - ఇంకో సారి పోటీ చేసి ఇంకోసారి ఓడిపోయి ఎందుకు కష్టాలు..? - నీకు ఆరితేరిన, ప్రావీణ్యం ఉన్న అంశాలు కొన్ని ఉన్నాయి..దాంట్లో నిన్ను బీట్ చేసే వారు లేరు..అందులోనే వెతుక్కోవాలి. - మనకు సంబంధం లేని అంశాల్లో దూరి సినిమా క్రేజంతా చంద్రబాబుకి అమ్మేద్దాం అంటే ఎలా..? - ఆ సినీ స్టార్ డమ్ ప్రజల వల్ల వచ్చింది...వాళ్లని కూడా మోసం చేసేస్తావా..? - ఏదేమైనా ఒక రాజకీయ పార్టీకి ఒక సిద్ధాతం, ఎజెండా, విధానం ఉండాలి - నమ్ముకున్న కార్యకర్తలను భుజాన మోసే బాధ్యత ఉండాలి. - ఇవన్నీ లేనప్పుడు ఎందుకు రాజకీయ పార్టీ. 2024లో టీడీపీ, జనసేనలు కనుమరుగు: - 2024 ఎన్నికల తర్వాత ఒక రాజకీయ పార్టీ మాకు ప్రతిపక్షంగా ఉండబోతోంది అనుకున్నాం. - కానీ ఒక దెబ్బకు రెండు పిట్టలు రాలబోతున్నాయి... - 2024లో రాష్ట్రంలో వైఎస్సార్సీపీకి ప్రతిపక్షం అనేది ఉండబోదని పవన్ కళ్యాణ్ నిర్ణయంతో తేలిపోయింది. - ఒకర్ని ఓడించడానికి పార్టీ పెట్టామని మేము ఏ రోజన్నా చెప్పామా..? - రాజశేఖరరెడ్డి గారి పరిపాలన మళ్లీ తెస్తామని మేం పార్టీ పెట్టాము. - ఈ రాష్ట్రంలో ఉన్న జనసైనికులు సొంత జెండాను వదిలేసి టీడీపీ జెండా మోసే కార్మికులుగా మారుతున్నారు అని చెప్తున్నాం. - లీగల్‌గా ఆయన బీజేపీతో ఉన్నాడు..మోడీ గారిని కలుస్తున్నాడు..ఢిల్లీ వెళ్లి పెద్దలను కలుస్తున్నాడు. - ఇల్లీగల్‌గా సాయంత్రానికి చంద్రబాబు ఇంటికి వెళ్లి కలుస్తున్నాడు.. - తప్పనిసరిగా బీజేపీ కూడా దీనిపై స్పందిస్తుందని నా అభిప్రాయం. - వైయస్ జగన్ గారి పొత్తు మాత్రం ఎప్పుడూ ప్రజలతోనే...