లోకేష్‌..నీ స్థాయి ఎంత‌?

జ‌గ‌న్ కుటుంబంతో నీకు ఏం సంబంధం

సూటిగా ప్ర‌శ్నించిన నంద‌మూరి ల‌క్ష్మిపార్వ‌తి

హైదరాబాద్‌ లోని తన స్వగృహంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి 
లక్ష్మీపార్వతి

చంద్ర‌బాబు, లోకేష్ రాజకీయాలను చూసి ప్రజలు అస‌హ్యించుకుంటున్నారు

గ‌తంలో విజ‌య‌మ్మ‌ను విమ‌ర్శించిన లోకేష్‌, ఇవాళ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెబుతారా?

అస‌లు విజ‌య‌మ్మ‌తో లోకేష్‌కు ఏం సంబంధం ఉంది?

లోకేష్‌.. ఏనాడైనా మీ మేనత్తలు మీ ఇంటికి వచ్చారా?.

కన్న తండ్రి ఎన్టీఆర్‌పై మీ నాన్న చెప్పులేసి అవమానిస్తుంటే.. మీ అమ్మ భువనేశ్వరి ఏనాడైనా మాట్లాడిందా?

లోకేష్‌.. ఏనాడైనా అమ్మమ్మ అంటూ నా దగ్గరికి వచ్చావా?. అసలు నా పుట్టినరోజు నీకు తెలుసా?

లోకేష్ మీ అమ్మానాన్న‌ల‌కు అస‌లు విలువ‌లే లేవు

అలాంటి వారి క‌డుపున పుట్టిన నీకు విలువ‌లు ఎక్క‌డుంటాయి?

తీవ్రంగా ఆక్షేపించిన ల‌క్ష్మిపార్వ‌తి

కుటుంబాలను చీల్చి మీరు ఏం సాధించలేరు

వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో మహిళల సంక్షేమం కోసం వైయ‌స్‌ జగన్‌ కృషి చేశారు

మహిళలకు వైఎస్‌ జగన్‌ 35 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చారు. 

మంచి లీడర్‌ అంటే వైఎస్‌ జగన్‌లా ఉండాలి. 

చంద్రబాబు, లోకేష్‌ రాజకీయాలను చూసి ప్రజలే అసహ్యించుకుంటున్నారు 

తండ్రికొడుకుల తీరును ఎండ‌గ‌ట్టిన నంద‌మూరి ల‌క్ష్మిపార్వ‌తి   

హైద‌రాబాద్‌: చంద్రబాబు, లోకేష్ రాజకీయాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, తెలుగు అకాడ‌మీ మాజీ చైర్‌ప‌ర్స‌న్ నంద‌మూరి ల‌క్ష్మిపార్వ‌తి పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ త‌న స్థాయి మ‌ర‌చి వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, ఆయ‌న‌కు విజయమ్మతో  ఏం సంబంధం ఉంద‌ని సూటిగా ప్ర‌శ్నించారు. గ‌తంలో విజ‌య‌మ్మ‌, ష‌ర్మిల‌పై ఐటీడీపీ ద్వారా అరాస్‌మెంట్ చేసిన లోకేష్‌..ఇవాళ విజ‌య‌మ్మ‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్ప‌డం ఏంట‌ని నిల‌దీశారు.  కుటుంబ వ్యవహారాలను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించడం మానుకోవాలని హెచ్చరిస్తూ, లోకేష్‌ తన స్థాయి ఏమిటో ఆలోచించుకోవాలని హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆమె హెచ్చ‌రించారు. చంద్రబాబు, లోకేష్‌.. మీ బతుకంతా నాటకాలు, మోసాలే అని మండిపడ్డారు . లోకేష్‌ మీ కుటుంబ చరిత్ర తెలుసుకో అంటూ హితవు పలికారు. మంచి లీడ‌ర్ అంటే వైయ‌స్ జ‌గ‌న్ లాగా ఉండాల‌ని, చంద్ర‌బాబు కాంగ్రెస్‌, బీజేపీ, క‌మ్యూనిస్టుల‌తో క‌లిసి వెళ్తూ నీచ రాజ‌కీయాలు చేస్తుంటార‌ని ధ్వ‌జ‌మెత్తారు. 
ప్రెస్‌మీట్‌లో ల‌క్ష్మిపార్వ‌తి ఇంకా ఏమ‌న్నారంటే..

- వైయ‌స్‌ జగన్‌ ముందు నీ స్థాయి ఎంత లోకేష్‌?

ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో చంద్ర‌బాబు, లోకేష్ వ్య‌వ‌హార శైలీని చూసి జనం నవ్వుతున్నారు. గతంలో వైయ‌స్ విజ‌య‌మ్మ‌ను విమర్శించి, ఇవాళ ఆమెకే లోకేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం ఎంత దిగజారుడు రాజకీయమో అందరికీ తెలిసిపోయింది. ఓటమి భయంతో తండ్రికొడుకులు అడ్డదారుల్లో నడుస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. వైయ‌స్ జ‌గ‌న్ రూ.20 వేల కోట్లతో మంచి రాజధాని నిర్మాణం సాధ్యమని స్పష్టమైన విజన్ చెబితే, అభివృద్ధిపై మాట్లాడకుండా వ్యక్తిత్వ హననానికి దిగుతున్నారు. మొన్న నారా లోకేష్‌ విజయమ్మకు శుభాకాంక్షలు చెప్పడం విడ్డూరంగా ఉంది.  లోకేష్‌ మీ కుటుంబ చరిత్ర తెలుసుకో.  వైఎస్‌ జగన్‌ ముందు నీ స్థాయి ఎంత లోకేష్‌? నీ బిల్డప్‌ ప్రజలకు తెలియదని అనుకుంటున్నావా?. లోకేష్‌ ఈవీఎంల ద్వారా గెలిచారు. జగన్ ఒంటరిగా పోరాడి అధికారంలోకి వచ్చారు. ఈవీఎంల సాయంతో అడ్డదారిలో గెలిచిన వారు ప్రజాస్వామ్యంలో ఓడిపోయినట్టే లెక్క‌.

- లోకేష్‌ మీ కుటుంబ చరిత్ర తెలుసుకో..

వైయ‌స్ జ‌గ‌న్‌ కుటుంబం గురించి నీకెందుకయ్య బాబూ? ముందుగా నీ కుటుంబం సంగతి చెప్పు. మీ మేనత్తలను నీవు సరిగ్గా చూసుకున్నావా? సొంత కుటుంబ సభ్యులనే పేదవాళ్లు అని దూరం పెట్టి, ఇప్పుడు ఇతరుల కుటుంబాలపై మాట్లాడటం ఏంటి? మీ మేనత్తలను చూడటానికి నీ నాన్న దొంగచాటుగా వెళ్లేవాడని కూడా అందరికీ తెలుసు. మీ కుటుంబంలోనే ఎన్నో విషయాలు ఉండగా, వాటిని పక్కన పెట్టి జగన్ కుటుంబంపై మాట్లాడటం సరైంది కాదు. మీ అమ్మ ఎంత కంట్రోల్ పెట్టిందో, మీ నాన్నను తన కుటుంబాని ఎంత దూరం పెట్టారో తెలుసుకో. ఒకసారి అయినా మీ మేనత్తలను ఇంటికి పిలిచి గౌరవించారా? ఆడపడుచులకు ఎప్పుడైనా గౌరవం ఇచ్చారా? గురివింద గింజ తన నలుపు ఎరుగదు అన్నట్టుగా, మీలోనే ఇన్ని లోపాలు ఉండగా జగన్ కుటుంబంపై మాట్లాడటం ఎందుకు? మీరు మీ కుటుంబాన్ని ఎంత ప్రేమిస్తున్నట్లు చూపించినా, అది కేవలం దొంగ ప్రేమలానే కనిపిస్తోంది.

- లోకేష్‌… మీ కుటుంబం గొడవలు జనాలకు తెలియవని అనుకుంటున్నావా?

లోకేష్‌.. మీ కుటుంబంలో నిత్యం జ‌రిగే గొడ‌వ‌లు జ‌నాల‌కు తెలియ‌వ‌నుకుంటున్నావా? ఎన్నిసార్లు అత్త–కోడళ్ల మధ్య తగాదాలు జరిగాయో అందరికీ తెలుసు. మీ భార్యాభర్తల మధ్య విభేదాలు కూడా ప్రజలకు తెలియవా? అధికారం కోసం మీ అమ్మ, నువ్వు, మీ భార్య ఎంతగా మీ నాన్న‌పై ఒత్తిడి చేస్తున్నారో లోకానికి తెలుసు. ఇన్ని విషయాలు ఉన్నప్పటికీ, నీకు విజ‌య‌మ్మ‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పే హక్కు ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతకు ముందు ఎప్పుడైనా చెప్పావా? విజయమ్మ గురించి గతంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడి, ఐటీడీపీలో ఆమెతో పాటు షర్మిలమ్మను లక్ష్యంగా చేసుకోలేదా? రాజకీయాలకు, కుటుంబాలకు కూడా మీరు మచ్చలా మారారు. ష‌ర్మిల చేసే రాజకీయాలకు మీరు వత్తాసు పలుకుతున్నారు. ఆ కుటుంబంలో విభేదాలు రావడానికి కారణం కూడా మీ నాన్న చంద్ర‌బాబే క‌దా? . ఎదుటి కుటుంబాన్ని చీల్చి మీరు ఏదో సాధిస్తామని అనుకుంటే, ప్రజల్లో మరింతగా బలహీనపడతారు. మీ పచ్చ మీడియా చూపిస్తున్న భ్రమల్లోనే మీరు ఉన్నారు, కానీ వాస్తవం ప్రజలకు బాగా తెలుసు.

- మీ నాన్న‌కు వాళ్ల అమ్మ మీద ప్రేమ ఉందా?

హైటెక్ సిటీ క‌ట్టే స‌మ‌యంలో చంద్ర‌బాబు తన సన్నిహితులతో, త‌ల్లి పేరుతో భూములు కొనుగోలు చేయించి, తర్వాత వాటిని కుటుంబ సభ్యుల పేర్లకు మార్చించుకున్నారు. చంద్ర‌బాబు త‌న త‌ల్లి పేరుతో కొన్న భూమి కూడా వెంట‌నే లోకేష్ పేరు మీద‌కు మార్చుకున్నారు.  నిజంగా అమ్మ మీద‌ ప్రేమ ఉంటే ఆ ఆస్తులను అలాగే వదిలి ఉండాల్సింది.  చంద్ర‌బాబు ఏనాడు త‌న తల్లిదండ్రుల బాగోగులు చూసుకోలేదు. వారి పట్ల గౌరవం చూపించలేదు. తండ్రి చ‌నిపోతే పెద్ద కుమారుడిగా త‌ల‌కొరివి పెట్ట‌కుండా త‌న త‌మ్ముడితో అంత్య‌క్రియ‌లు చేయించాడు.   

- ఎవ‌రు ఏం చేశారో చర్చిద్దాం రండి..

చంద్ర‌బాబు త‌న కుటుంబానికి ఎలాంటి న్యాయం చేశాడో, వైయ‌స్ జ‌గ‌న్ ఏం చేశారో చ‌ర్చిద్దాం రాండి.  ఎంతసేపు వైయ‌స్ జ‌గ‌న్‌ తన తల్లి, చెల్లిని చూడటం లేదని మాట్లాడటమేనా మీ రాజకీయం? కోట్లాది మహిళలకు న్యాయం చేసిన నాయకుడు జగన్‌. ప్రతి మహిళ ఆయనను తన సొంత అన్నగా, తమ్ముడిగా, కొడుకుగా భావించింది. ఇంటి వద్దకే పింఛన్‌, ‘అమ్మ ఒడి’ వంటి పథకాలతో కుటుంబాలకు అండగా నిలబడ్డారు. మహిళల పేరుతో ఇళ్లు ఇచ్చి, పదవులు,పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించి వారి జీవితాలను నిలబెట్టారు.

- తండ్రీకొడుకులు రాహు, కేతువులు

వైయ‌స్ జ‌గ‌న్‌ను ప్రజలు గౌరవిస్తుంటే, తండ్రి కొడుకులు రాహు–కేతువుల్లా అడ్డదారిలో అధికారంలోకి వచ్చి నోటికి వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతున్నారు. ర‌క్తసంబంధాలను ఎవరు చెరపలేరు, తాత్కాలిక విభేదాలు ఉన్నా చివరికి కుటుంబం ఒక్కటే అవుతుంది. ఇలాంటి నీచ రాజకీయాలు మానుకో లోకేష్‌,  మంచి నాయకుడు ప్రజల నుంచి రావాలి గానీ, అడ్డదారిలో కాదు.

ప్రజల్లో నీకు ఏ స్థాయి ఉందో ఆలోచించుకో లోకేష్‌. అడ్మినిస్ట్రేషన్‌పై అవగాహన లేకుండా ముఖ్యమంత్రి స్థానం గురించి మాట్లాడటం సరైంది కాదు. ఇతర కుటుంబాల్లో చిచ్చుపెట్టి రాజకీయ లాభాలు పొందాలని చూడటం తప్పు. మీరు ఎంతగా జగన్ కుటుంబంపై దాడి చేస్తే, ఆయన అంతగా ప్రజాభిమానాన్ని పొందుతున్నారు. ఎందుకంటే ఆయన ప్రజాసంక్షేమంపై దృష్టి పెట్టిన నాయకుడు.

జగన్ ఎప్పుడైనా మీ కుటుంబంపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారా? మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం దురదృష్టకరం. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.  మీ కుటుంబ ఆస్తులు, స్కామ్‌లపై  ఏదో ఒక‌రోజు జైలుకు వెళ్ల‌క‌త‌ప్ప‌దు.  ఇలాంటి దౌర్భాగ్య రాజకీయాలు మానుకోవాలని చంద్రబాబు, లోకేష్‌లకు నంద‌మూరి ల‌క్ష్మిపార్వ‌తి హితవు పలికారు.

Back to Top