ఏపీ కేబినెట్‌ తొలి సమావేశం ప్రారంభం

 అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన నూతనంగా విస్తరించిన మంత్రివర్గం తొలి సమావేశం ప్రారంభమైంది. తొలి కేబినెట్‌లోనే పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గత వారం రోజులుగా జరుగుతున్న వివిధ శాఖల అధికారిక సమీక్ష సమావేశాల్లో ఇలాంటి నిర్ణయాలకు సంబంధించిన పలు సంకేతాలను వైఎస్ జగన్‌ ఇచ్చారు. రైతులు, మహిళలు, అవ్వా తాతలు, వికలాంగులు, ఉద్యోగులు, కార్మికుల ప్రయోజనాలే ప్రధాన అజెండాగా ముఖ్యమంత్రి కేబినెట్‌ సమావేశం నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు ఎనిమిది అంశాలతో కేబినెట్‌ అజెండాను రూపొందించారు. అలాగే అక్టోబర్‌ 15 నుంచి అమలు చేయనున్న  వైయ‌స్ఆర్ రైతు భరోసా పథకంపై చర్చించనున్నారు. 

 

 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top