జూన్‌ 7 నుంచి పదో తరగతి పరీక్షలు

పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేసిన మంత్రి ఆదిమూలపు సురేష్‌

ఈ ఏడాది పదిలో 7 పేపర్లే..సైన్స్‌లో రెండు పేపర్లు

జూలై 21 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం

అమరావతి: పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు. జూన్‌ 7 నుంచి 16వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ ఏడాది పదో తరగతిలో 7 పేపర్లు ఉంటాయని, సైన్స్‌లో రెండు పేపర్లు ఉంటాయని..వంద మార్కులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జూన్‌ 5వ తేదీ వరకు పదో తరగతి క్లాసులు కొనసాగుతాయని తెలిపారు. జూన్‌ 7న ఫస్ట్‌ లాంగ్వేజ్, 8న సెకండ్‌ లాంగ్వేజ్,9న ఇంగ్లీష్, 11న భౌతిక శాస్త్రం, 12న జీవశాస్త్రం,14న సోషల్‌ పరీక్ష ఉంటుందన్నారు. మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 24 వరకు ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ ఉంటాయన్నారు. మే 5 నుంచి 23 వరకు ఇంటర్‌ పరీక్షలు ఉంటాయన్నారు. పరీక్షా ఫీజులో పెంపుదల లేదన్నారు. గతేడాది ఉన్న పరీక్ష ఫీజునే కట్టాలన్నారు. పరీక్ష ఫీజు రూ.490, అప్లికేషన్‌ రూ.10, ప్రాక్టికల్స్‌కు రూ.190 చెల్లిస్తే సరిపోతుందన్నారు. అన్ని తరగతులకు మే 15తో క్లాసులు ముగుస్తాయని చెప్పారు. జులై 21 నుంచి కొత్త విద్యా సంవత్సరం మొదలవుతుందని చెప్పారు.
 

Back to Top