నంద్యాల: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకువచ్చిన రైతు భరోసా కేంద్రాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని శ్రీశైలం ఎమ్మెల్యే, ఎథిక్స్ కమటీ చైర్మన్ శిల్పా చక్రపాణిరెడ్డి తెలిపారు. శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు మండలం వడ్ల రామాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన వైయస్ఆర్ రైతు భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడలేని విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రైతు సంక్షేమానికి వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీలో వైయస్ఆర్ రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులను చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నారని చెప్పారు. ప్రతిపక్ష నాయకులు చెబుతున్న మోసపూరిత మాటలు నమ్మొద్దని, సీఎం వైయస్ జగన్ రైతులకు ఎన్నో ప్రత్యేకమైన పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. మన ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గర్వంగా చెప్పారు. నూతన బి.టి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ ఆత్మకూరు మండలం వడ్ల రామాపురం గ్రామం నుంచి కొట్టాల చెరువు వరకు రూ.7,10,00,00 నిధులతో నూతన బి.టి రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి భూమి పూజ చేశారు. వడ్ల రామాపురం గ్రామంలో ముస్లిం స్మశాన వాటికలో రూ.18 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన కాంపౌండ్ వాల్ ను ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో వైయస్ఆర్‌సీపీ యూత్ నాయకుడు శిల్పా కార్తీక్‌రెడ్డి, నాయకులు శిల్పా భువనేశ్వర్‌రెడ్డి, జెడ్పీటీసీ కురుకుంద శంకర్‌రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ బాలస్వామి యాదవ్, వైయస్ఆర్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.