కోవిడ్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

 ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి
 

 వైయ‌స్ఆర్ జిల్లా: కోవిడ్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని  ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. కోవిడ్ కట్టడికి సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తోందని అన్నారు. శనివారం శ్రీకాంత్‌రెడ్డి చేతులమీదుగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు ఆక్సీ ఫ్లో మీటర్ వితరణ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీ మిథున్‌రెడ్డి సహకారంతో రాయచోటి ఏరియా ఆస్పత్రికి మరో 10 ఆక్సిజనేటర్లు అందాయని అన్నారు. కోవిడ్‌ బాధితులకు సహాయం చేయడంలో మిథున్‌రెడ్డి కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆక్సిజన్‌ ప్లాంట్‌ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలిస్తోందని, అలాగే 100 పడకల ఆస్పత్రి అభివృద్ధి నిర్మాణ పనులు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top