సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నిబ‌ద్ధ‌త చూసి ఆశ్చ‌ర్య‌పోయా..

ఎలాంటి గర్వం లేదు.. అందరి సలహాలు స్వీకరిస్తారు, పాటిస్తారు 

సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌పై చిన‌జీయ‌ర్ స్వామి ప్ర‌శంస‌లు

హైదరాబాద్‌: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జగన్‌మోహ‌న్‌రెడ్డి నిబద్ధతను చూసి ఆశ్చర్యపోయానని చిన‌జీయ‌ర్‌ స్వామి అన్నారు. సీఎం వైయ‌స్ జగన్‌పై చినజీయర్‌ స్వామి ప్రశంసలు కురిపించారు. శంషాబాద్ ముచ్చింతల్‌లోని శ్రీరామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో చిన‌జీయ‌ర్ స్వామి మాట్లాడుతూ.. ప్రతీ పాలకుడు అందరినీ సమానంగా చూస్తూ వారి అవసరాలను గుర్తించి వాటిని పూర్తి చేయాలన్నారు. విద్య, వయస్సు, ధనం, అధికారం నాలుగు కలిగి ఉన్నవారు ఇతరుల సలహాలు తీసుకోరని, కానీ ఇవన్నీ ఉన్న సీఎం వైయ‌స్‌ జగన్‌లో ఎలాంటి గర్వం లేదన్నారు. ముఖ్య‌మంత్రి వైయ‌స్‌ జగన్‌ అందరి సలహాలను స్వీకరిస్తారు.. సలహాలను పాటిస్తారని చిన‌జీయ‌ర్ స్వామి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన విద్యను అందిస్తున్న వైయ‌స్‌ జగన్‌ను అభినందిస్తున్నానని, మరింత ఉన్నత స్థానాలకు వైయ‌స్ జ‌గ‌న్ ఎదగాలని కోరుకుంటున్నానని చినజీయర్‌ స్వామి అన్నారు.

శ్రీ రామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో పాల్గొన్న ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని చిన‌జీయ‌ర్ స్వామి ఘ‌నంగా స‌త్క‌రించారు. శ్రీ రామానుజ‌చార్యుల ప్ర‌తిమ‌ను సీఎంకు బ‌హూక‌రించారు.

వైయ‌స్ఆర్ నాకు బాగా తెలుసు.. : చిన‌జీయ‌ర్ స్వామి
శ్రీరామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో దివంగ‌త మహానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిని చిన‌జీయ‌ర్ స్వామి గుర్తుచేశారు. వైయ‌స్ఆర్ తనకు బాగా తెలుసని.. ముఖ్యమంత్రి కాకముందు వచ్చి త‌న‌ను కలిశారని చినజీయర్‌ స్వామి చెప్పారు. వైయ‌స్ఆర్ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేశారన్నారు.

తాజా వీడియోలు

Back to Top