వైయ‌స్ఆర్‌సీపీ బీసీల పార్టీ

8న విజ‌య‌వాడ‌లో బీసీల ఆత్మీయ సమ్మేళనం.. 

మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ‌, వైయ‌స్ఆర్‌సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్య‌క్షులు జంగా కృష్ణ‌మూర్తి 

తాడేప‌ల్లి:   వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీల పార్టీ అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ అన్నారు. విజయవాడలో డిసెంబర్ 8న భారీ ఎత్తున బీసీ ఆత్మీయ స‌మ్మేళ‌నం నిర్వహిస్తామని మంత్రి  తెలిపారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ సైతం ఈ స‌ద‌స్సుకు హాజరయ్యే అవకాశం ఉందన్నారు.  ఇవాళ తాడేపల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాలయంలో బీసీ మంత్రులు, నేతలు కీలక సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా  మంత్రి వేణుగోపాల‌కృష్ణ‌, వైయ‌స్ఆర్‌సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్య‌క్షులు, ఎమ్మెల్సీ జంగా కృష్ణ‌మూర్తి మీడియాతో మాట్లాడారు.

బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ.. 
- అందుబాటులో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ బీసీ నాయకులు పార్టీ పెద్దలతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని, మూడున్నరేళ్ళ పాలనలో బీసీ వర్గాలకు జరిగిన మేలు, బీసీల జీవన ప్రమాణాలు ఎలా పెరిగాయి, గ్రామ స్థాయి నుంచి బీసీ వర్గాలకు పెరిగిన రాజకీయ ప్రాధాన్యత.. తదితర అంశాలపై చర్చించడం జరిగింది.

- 139 బీసీ కులాలకు సంబంధించి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, 672 మంది డైరెక్టర్లను నియమించాం, ప్రభుత్వ కార్పొరేషన్లలో కూడా 122 మందిని బీసీలను నియమించడం జరిగింది. 

- బీసీ కార్పొరేషన్లు ఏర్పడి కూడా రెండేళ్ళు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో డిసెంబరు 8 న బీసీల ఆత్మీయ కలయిక సమ్మేళనం నిర్వహించాలని నిర్ణయించాం. 

- గ్రామ స్థాయిలో సర్పంచ్ నుంచి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేషన్ల ఛైర్మెన్లు, మెంబర్లు, ఆలయ కమిటీల ఛైర్మన్లు, డైరెక్టర్లు, బీసీ కార్పొరేషన్ల ఛైర్మెన్లు, డైరెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యుల వరకు.. అందర్నీ ఈ సమ్మేళనానికి ఆహ్వానిస్తాం. 

- బీసీలకు సంబంధించి ఒక పండుగ వాతావరణంలో.. బీసీలకు ఈ ప్రభుత్వం ఎంత అండగా ఉంటుందో, సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా బీసీ వర్గాలకు ఒక భరోసా ఇచ్చిన విషయాన్ని ఈ సమావేశంలో తెలియజెబుతాం. 

- చంద్రబాబు హయాంలో ఇచ్చినట్టు.. కుల వృత్తిలో ఉన్నవారికి ఒక పనికిరాని పనిముట్టు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రభుత్వం మాది కాదు. బీసీల అవసరాలను గుర్తించి... వారి ఆర్థిక, సామాజిక, రాజకీయ చైతన్యానికి బాటలు వేస్తున్న ముఖ్యమంత్రి జగన్ గారు. అందుకే చంద్రబాబును బీసీలంతా క్విట్ బాబూ అని చెప్పారు. 

- అమ్మ ఒడి నుంచి ఆసరా,  చేయూత, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ళు, ఆసుపత్రులు అభివృద్ధి.. వీటన్నింటి ద్వారా బీసీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి జగన్ గారు కృషి చేస్తున్నారు. 

- ఇది బీసీల ప్రభుత్వం. బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదని, సమాజానికి వెన్నెముక అని, సమాజ సంస్కృతిని సంరక్షించినవారు బీసీలేనని జగన్ గారు పలు సందర్భాల్లో చెప్పారు.

మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ.. 
- దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే.. బీసీల రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్  అని అందరూ చెబుతున్నారు.
- రాష్ట్ర చరిత్రలో ఎవరూ చేయని విధంగా, బీసీలను గుర్తించి, బీసీలకు మేలు చేసింది జగనన్న కాబట్టి.. బీసీ సమాజం అంతా ఆయనకు అండగా నిలబడుతున్నారు. 

పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ..  
- బీసీల అభ్యున్నతికి దిశ, దశ నిర్దేశించిన నాయకుడు జగన్ గారు.
- గత ఎన్నికలకు ముందే,  తన సుదీర్ఘ  పాదయాత్రలో బీసీల స్థితిగతులను గుర్తించి, వారి జీవన ప్రమాణాలపై ఒక కమిటీ వేసి, అధ్యయనం చేయించిన నాయకుడు జగన్ గారు. 
- ఎన్నికల ముందే బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక బీసీ డిక్లరేషన్ లో చెప్పిన ప్రతి అంశాన్నీ ఈ ప్రభుత్వం అమలు చేయడం జరిగింది. 
- డిక్లరేషన్ లో పొందుపరిచిన అంశాలతో పాటు, చెప్పని కొత్త అంశాలను కూడా చేర్చి, ముఖ్యమంత్రి జగన్ గారు అమలు చేస్తున్నారు.
- మూడున్నరేళ్ళలో ఈ ప్రభుత్వం రూ. 1.76 లక్షల కోట్లు డీబీటీ ద్వారా ప్రజలకు అందిస్తే.. అందులో 50 శానికి పైగా, అంటే రూ. 86 వేల కోట్లకు పైగా బీసీలకు సంక్షేమ పథకాల ద్వారా నేరుగా డబ్బులు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. 

ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ..  
- మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, ఎవర్నీ దేబిరించాల్సిన అవసరం లేకుండా బీసీలకు పలు సంక్షేమ పథకాల ద్వారా.. ఒక్క బటన్ నొక్కి, దాదాపు రూ. 86 వేల కోట్లు మూడున్నరేళ్ళలో ఇచ్చారన్నారు. 
- చంద్రబాబు బీసీలకు చేసిన మేలు ఏమిటో చెప్పలగరా అని ప్రశ్నించారు. 
- బీసీలు అన్నివిధాలా ఒక దిక్చూచిగా జగన్ గారు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. 
- జనాభా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని పార్లమెంటులో ప్రైవేటు మెంబరు బిల్లు పెట్టిన ఏకైక పార్టీ  వైఎస్ఆర్ కాంగ్రెస్ అని చెప్పారు. 

- ఈ సమావేశంలో బీసీ మంత్రులు బొత్స సత్యనారాయణ,  బూడి ముత్యాలనాయుడు,  జోగి రమేష్, ఎంపీ మోపిదేవి వెంకట రమణ, ఎమ్మెల్యేలు కె. పార్థసారథి, అనిల్ కుమార్ యాదవ్ తదితరులు హాజరైనట్టు చెప్పారు. 

Back to Top