వ్య‌వ‌సాయానికి ప్ర‌భుత్వం పెద్ద‌పీట‌

స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం
 

శ్రీ‌కాకుళం:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం వ్య‌వ‌సాయానికి పెద్ద పీట వేసింద‌ని అసెంబ్లీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం పేర్కొన్నారు. శ‌నివారం అముదాల వ‌ల‌స నియోజ‌క‌వ‌ర్గంలో స్పీక‌ర్ ప‌ర్య‌టించారు. ప‌లు చోట్ల రైతు భ‌రోసా కేంద్రాలు, హెల్త్ సెంట‌ర్ల‌కు స్పీక‌ర్ భూమి పూజ చేశారు. ఈ సంద‌ర్భంగా త‌మ్మినేని సీతారాం మాట్లాడుతూ..సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను తూచ త‌ప్ప‌కుండా అమ‌లు చేస్తున్నార‌ని చెప్పారు.వైద్యం అంద‌రికి అందుబాటులో ఉండేలా ఇటీవ‌ల 1088 కొత్త అంబులెన్స్‌లు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రారంభించార‌ని తెలిపారు. అర్హులంద‌రికీ సంక్షేమ ప‌థ‌కాలు అందుతున్నాయ‌ని స్పీక‌ర్ పేర్కొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top