అరకులోయకు విస్టా డోమ్ కోచ్ లతో ప్రత్యేక రైలు

విశాఖ‌: అరకులోయకు వెళ్లే టూరిస్టులకు రైల్వే శాఖ సరికొత్త అనుభూతి కలిగించేందుకు ప్ర‌త్యేక రైలును ఏర్పాటు చేశారు. ఈ రైలును ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు, రాష్ట్ర మంత్రి అవంతి శ్రీ‌నివాస్ ప్రారంభించారు. అరకు వెళ్లే పర్యాటకుల కోసం విశాఖ నుంచి అరకులోయకు విస్టా డోమ్ కోచ్ లతో ప్రత్యేక రైల్ ను ఏర్పాటు చేసిన‌ట్లు మంత్రి తెలిపారు.  ఆంధ్రా ఊటీగా పేరుగాంచిన అరకు ప్రాంతానికి వెళ్లే టూరిస్టులకు ఈ రైలు ద్వారా సరికొత్త అనుభూతి లభిస్తుందని అన్నారు. టూరిస్టులను మరింతగా ఆకర్షించేందుకు ఈరైలు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. టూరిజం పరంగా రాష్ట్ర ప్రభుత్వం టూరిస్టులకు అనేక సౌకర్యాలు కల్పిస్తోందని అన్నారు. టూరిస్టులు ఈ సౌకర్యాలను ఉపయోగించుకుని విహారయాత్రను విజయవంతం చేసుకోవాలని కోరారు.

తాజా ఫోటోలు

Back to Top